ఐటీ గ్రిడ్ కేస్ ఇపుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్న తెలంగాణా పోలీసులు ఎన్నో విషయాలు కనుగొన్నారు. వాటిని ఈ రోజు మీడియాతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్  సజ్జనార్ అనేక విషయాలను  వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పెద్ద వాళ్ళ పాత్ర పైనా అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.


పూర్తిగా దుర్వినియోగమే:


హైదరాబాద్ లోని ఐటిగ్రిడ్స్ సంస్థ ప్రభుత్వ సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు వచ్చిన పిర్యాదు మేరకే తాము చర్యలు తీసుకున్నామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తాము ఆ కంపెనీలో సోదాలు జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు ఉన్నారని ఆయన అన్నారు. వారి సమక్షంలోనే పంచనామా చేయడం జరిగిందని అన్నారు.వీరి వద్ద ఉన్న సమాచారంలో ప్రజల వ్యక్తిగత సమాచారం పొందినట్లు వెల్లడైందని ఆయన అన్నారు. ప్రజల కులాలు ,ప్రభుత్వ పదకాల లబ్దిదారుల వివరాలు, వాటన్నిటిని విశ్లేషణ చేసి పెట్టుకున్నారని, అమెజాన్ లో కూడా పెట్టారని ఆయన అన్నారు. చట్ట విరుద్దంగా ఈ సమాచారాన్ని వాడినట్లు వెల్లడైందని అన్నారు.


ఈసీకి లేఖ :


ఎన్నికల సంఘానికి దీనిపై లేఖ రాస్తున్నామని ఆయన అన్నారు.అలాగే ఆధార్ కార్డు సంస్థకు కూడా లేఖ రాశామని ఆయన అన్నారు. ఐటి గ్రిడ్స్ సంస్థ ఎమ్.డి.అశోక్ కు నోటీసు ఇచ్చామని, ఆయన వచ్చి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎపిలో నియోజకవర్గాల వారీగా సమాచారం ఉందని ఆయన అన్నారు. సేవామిత్ర ఆప్ ద్వారా కూడా ఈ సమాచారం వాడినట్లు కనబడిందని అన్నారు. ఈ కేసులో ఎంత పెద్ద వారు అయినా చర్య తీసుకుంటామని అన్నారు.
సేవా మిత్ర అప్లికేషన్ దుర్వినియోగం అవుతున్న తీరుపై కూడా సమాచారం వచ్చిందని ఆయన అన్నారు.ఎపిలో ఓట్ల గల్లంతుపై కేసులు పెట్టారని,దానికి దీనికి సంబందం ఉండవచ్చని ఆయన అన్నారు.తాము ఎవరికి కస్టడీకి తీసుకోలేదని, వారికి నోటీసులు ఇచ్చి సాక్షం తీసుకున్నామని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: