ఐటీ గ్రిడ్స్ మరియు బ్లూ ఫ్రాగ్ కంపనీల పేర్లు డేటా చౌర్యం  “సమాచార చౌర్యం" కేసుఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య వీటికి సంభందించిన కేసులు సంఘర్షణకు దారితీస్తున్నాయి. పలువురు బడా బడా నాయకులకు ఈ కేసుతో సంబంధమున్నట్లు వస్తున్నవార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. డేటా చౌర్యం తీవ్ర మైన నేరం. ఈ నేరం ఋజువైతే పెద్ద తలకాయలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Image result for sajjanar ips hyderabad

సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమాచారం: యథాథతం

ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేసిన సమయంలో కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చెప్పారు.సేవా మిత్ర యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కంపెనీ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని గుర్తించి నట్టు చెప్పారు.  సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని సజ్జనార్ చెప్పారు.

Image result for IT Grids

ఈ విచారణలో కీలకమైన ఆధారాలను సేకరించినట్టు సజ్జనార్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు.ఆధార్, ఓటరు కార్డులు కులాలు, ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారనే సమాచారాన్ని కూడ ఈ సంస్థ సేకరిస్తున్నట్టు గుర్తించినట్టుగా సజ్జనార్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటాను కూడ ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉందన్నారు.ఈ డేటాను క్షుణ్ణంగా ఐటీ గ్రిడ్ సంస్థ ఎనలైజ్ చేసినట్టుగా గుర్తించామన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థపై విచారణ కొనసాగుతోందని సజ్జనార్ చెప్పారు. ఐటీ గ్రిడ్‌కు నోటీసులు ఇచ్చామని చెప్పారు.


ఐటీ గ్రిడ్ సంస్థ యజమాని ఆశోక్ కు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఇంత వరకు కూడ ఆశోక్ తమ వద్దకు రాలేదన్నారు. ఆశోక్ ఎక్కడ ఉన్నా కూడ లొంగి పోవాలని సజ్జనార్  కోరారు. ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని అమెజాన్ సర్వీసెస్‌ లో భద్రపరుస్తు న్నట్టు తేలిందన్నారు. పలువురు వ్యక్తులకు సంబంధించిన ఆధార్, ఓటరు ఐడీకార్డుల సమాచారం కూడ ఈ సంస్థ సేకరించినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయమై ఆధార్ సంస్థ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Image result for IT grids india company and lokesh

ఐటీగ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌ కు పంపినట్టు సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను తాము విచారిస్తున్న సమయంలో ఈ నలుగురు మిస్సైనట్టుగా పెద్ద కాకాని పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారని సజ్జనార్ గుర్తు చేశారు.  అంతేకాదు తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు అదృశ్య మైనట్టుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సజ్జనార్ చెప్పారు.  ఏపీ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ సేకరిస్తోందని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే  ఆయనను ఏపీ పోలీసులు వేధించారని చెప్పారు.ఈ విషయమై ఏపీ పోలీసులపై కూడ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Image result for IT Grids

సున్నితమైన డేటాను ఎందుకు పబ్లిక్‌లో పెట్టారని సజ్జనార్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టబోమని సజ్జనార్ ప్రకటించారు.ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే ఓట్ల తొలగింపు విషయమై 45 కేసులు నమోదైనట్టుగా సజ్జనార్ గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ఓట్ల తొలగింపు కోసం  ప్రయత్నించారా అనే విషయమై దర్యాప్తులో తేలనుందన్నారు. ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటా ఐటీ గ్రిడ్ సంస్థకు ప్రభుత్వం నుండి వచ్చిందా, మూడో వ్యక్తి నుండి వచ్చిందా అనే విషయమై  ఆరా తీస్తున్నట్టుగా  సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం హైద్రాబాద్ కేంద్రంగా ఉందన్నారు. ఫిర్యాదు కూడ హైద్రాబాద్‌లోనే ఇచ్చిన విషయాన్ని సజ్జనార్ గుర్తు చేశారు.

Image result for IT grids india company and lokesh 

మరింత సమాచారం తెలుసుకోండి: