ఏపీ ప్రజల సమాచార చౌర్యం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎదురు దాడికి దిగారు. డేటా వ్యక్తి గత ఆస్తి అని,  తెలుగుదేశం పార్టీ డేటా ను అప్‌ డేట్‌ చేస్తుంటే కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ ఆయన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా "మిమ్మల్ని వదిలిపెట్టను, మీ మూలాలను కదిలిస్తా, నా జోలికి వస్తే వదిలేది లేదు" అంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగారు.

Image result for chandrababu threatens kcr for Data theft

జగన్ హైద్రాబాద్‌ లో ఉండి  కుట్రలకు పాల్పడుతున్నారని, కేసీఆర్‌ తో  జగన్ కుమ్మక్కై  టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీని దెబ్బతీసేందుకు మీరు ప్రయత్నిస్తే మీ మూలాలు లేకుండా చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా ప్రభుత్వ డేటాను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసునని చెప్పారు.ప్రతి రోజూ తాను 50వేల మందితో ఒకేసారి టెలికాన్పరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు బాబు గుర్తు చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని బాబు చెప్పారు. ఇప్పటికే తమ రాష్ట్రం కష్టాల్లో ఉందన్నారు. హైద్రాబాద్‌ను 60 కష్టాలు కష్టపడి అభివృద్ధి చేశామన్నారు. హైద్రాబాద్‌ను తెలంగాణకు ఇచ్చినా నష్టం లేదని అమరావతికి వచ్చినట్టు చెప్పారు.

Image result for chandrababu threatens kcr for Data theft

తప్పులు నిర్భయంగా చేస్తూ ఇప్పుడు రాష్ట్రంలో ప్రయివేట్ కంపనీలు ప్రజల సమాచారాన్ని చౌర్యం చేసి ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వాన్ని బెదిరించటం దొంగే పోలీస్ ను దొంగా! దొంగా అన్నట్లుంది సమాచారం ప్రజలది - ప్రభుత్వం దానికి ట్రస్టీ - సమాచార సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిది. డాటా ఎన్నటికీ వ్యక్తిగత ఆస్థిగాదు. ప్రజల ఆస్థి అంటే ప్రభుత్వంలోని వ్యక్తుల ఆస్థి కూడా కాదనే! అర్ధం. ఈ సమాచారం మొత్తం ప్రభుత్వ పరిది దాటరాదు. వేరే వ్యవస్థకు అనుసంధానం చేయరాదు. అమేజాన్ సర్వర్లలో నిక్షిప్తం అయితే....దానర్ధం? చంద్రబాబు,  లోకెష్ లే చెప్పాలి. 

Image result for chandrababu threatens kcr for Data theft
* బ్యాంక్‌ ఖాతాలతో సహా కోట్ల మంది వ్యక్తిగత సమాచార దొంగతనం 
* 2019 ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి టీడీపీ కుయుక్తులు...కుతంత్రాలు..  సైబర్‌ ప్రపంచంలో "ఓటర్ల బ్యాంకు ఖాతాలు" వివరాలు పెట్టటం శ్రేయస్కరమేనా? 
* "తెలుగు దేశం పార్టీ యాప్‌" నకు ప్రభుత్వం దగ్గరున్న "ప్రజల వ్యక్తి  గత సమాచారం" అనుసంధానం సమంజసమా? 
* ఐటీ గ్రిడ్స్ గ్రిడ్స్‌ ఇండియా సంస్థకు పూర్తి సమాచారం అంద జేసిన "బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌"  
* అన్ని శాఖల సమాచారాన్ని "బ్లూ ఫ్రాగ్‌ కు యాక్సెస్‌ ఇచ్చిన ప్రభుత్వం" - బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ నుండి సమాచారం ఐటీ గ్రిడ్స్ గ్రిడ్స్‌ ఇండియా సంస్థకు ప్రయాణం మరి అక్కడి నుండి మరెక్కడికైనా వెళ్ళదని గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వగలదా?  
* సామాజిక కార్యకర్త లోకేశ్వరరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు 
* ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు.. సైబరాబాద్‌ పోలీసుల అదుపులో నలుగురు ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులు
* నష్ట నివారణ కోసం ఏపీ పోలీసులను రంగంలోకి దించిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు 
 Image result for chandrababu threatens kcr for Data theft
సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ — టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలను కదిలిస్తా.  కాంగ్రెస్ కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు నేనే తెచ్చా. మీరు వాడే సెల్‌ఫోన్‌ కూడా నేనే కనిపెట్టాను. రాష్ట్ర విభజనతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యేలేదు. ఎంతమంది కలిసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీ ఆటలు సాగనివ్వను. 37ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీఆర్‌ నన్ను ఓడిస్తామంటున్నారు. ఆంధ్రాలో టీఆర్‌ఎస్‌ పార్టీ లేదు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఇలా బెదిరిస్తున్నారు. అందుకే మీకు రోషం రావాలి’----అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: