తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అడ్డంగా బుక్ చేసింది. ఇప్పుడేమో డేటా వ్యవహారంలో టీడీపీ బుక్ అయినట్టు కనిపిస్తుంది. చంద్ర బాబు భహిరంగ సభలో ఇప్పుడు నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే..' అంటూ చంద్రబాబు చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి.

Image result for chandra babu

చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెడుతున్నారంటే, ఆయన అడ్డంగా బుక్కయిపోయినట్లే. 'కేసులో ఎంతటి పెద్దవాళ్ళున్నా వదిలే ప్రసక్తేలేదు..' అంటూ తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారి సజ్జనార్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం రేగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ తప్పదా.? లేక లోకేష్‌ అరెస్టవుతారా.? అసలు 'డేటా దొంగతనం' వెనుక వున్నదెవరు.? అన్నది వేచి చూడాల్సిందే.

నన్ను కాపాడండి మహాప్రభో: చంద్రబాబు గగ్గోలు

కాగా, 'ఇది తెలంగాణ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ కాదు. ఆ కేసుతో మాకు సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది..' అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఈ వ్యవహారంపై అత్యంత వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారు. డేటా దొంగతనంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదుతో హైద్రాబాద్‌ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో కేసు హైద్రాబాద్‌లోనే నమోదు కావడంతో తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: