ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందంటూ దాఖలైన కేసు ఈ వివాదానికి ఆజ్యం పోసింది. తమ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని జగన్ కు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ఈ దాడులు చేస్తోందని, తమ సమాచారాన్ని తస్కరించినందుకు తగిన బుద్ధి చెప్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 60 లక్షల మంది టీడీపీ కార్యకర్తల సమాచారం అందులో ఉందని చెప్తున్నారు. గుడ్.. 60 లక్షల మంది టీడీపీ కార్యకర్తల సమాచారం అందులో ఉంటే.. మరి 5 కోట్ల మంది ఆంధ్రుల వ్యక్తిగత సమాచారాన్ని మీరు ఎలా దొంగలించారనేది ఇప్పుడు సర్వాత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న.

Image result for it grids india pvt ltd

పార్టీలన్నీ ఆన్ లైన్ బాట పడ్తున్న మాట నిజం. అందులో తప్పుబట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా చాలా పనులు సులువుగా సాగిపోతుంటాయి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత ముందుంటారు. ఇప్పుడు ఆ టెక్నాలజీనే చంద్రబాబు మెడకు చుట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కోసం రూపొందించిన సేవా మిత్ర ఆప్ కోసం బూత్ లెవల్ కార్యకర్తల సమాచారాన్ని సేకరించారు. సుమారు 60 లక్షల మంది ఇందులో ఉన్నట్టు స్వయానా సీఎం చంద్రబాబే చెప్తున్నారు. వారి నుంచి నిత్యం బూత్ లెవల్ సమాచారాన్ని సేకరించడం, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.

Image result for it grids india pvt ltd

పార్టీకోసం ఈ యాప్ రూపొందించడం తప్పు కాదు.. అందులో 60 లక్షల మంది కార్యకర్తల సమాచారం పొందుపరచడం నేరం కాదు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా ఉందని నిర్ధారించారు తెలంగాణ పోలీసులు. బూత్ లెవల్లోని ఓటర్లు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన వారి వివరాలు, ఆధార్ కార్డులు.. తదితర సమాచారం ఇందులో ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఇదే ఇప్పుడు అసలైన సమస్య.

Image result for it grids india pvt ltd

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన 60 లక్షల మంది సమాచారం దొంగలించారని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడ్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాజాగా పార్టీలో చేరిన అశోక్ బాబు సహా లోకేష్, చంద్రబాబులు ఏదో నేరం జరిగిపోయినట్లు మాట్లాడ్తున్నారు. మరి కోట్లాది ఆంధ్రప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆ యాప్ లో ఉంచడం నేరం కాదా..? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? పార్టీ అవసరాలకోసం ఆధార్, ఓటరు కార్డుల సమాచారం దొంగలించడాన్ని ఏమనాలి? దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? నిజంగా మీరు ప్రజల సమాచారాన్ని దొంగలించకుండా ఉండి ఉంటే ఎందుకు భయపడ్తున్నారు? కేవలం పార్టీ కార్యకర్తల సమాచారమే ఉంటే .. భయపడాల్సి అవసరం ఏముంది? దాన్ని వైసీపీ వాళ్లు తీసుకున్నా, టీఆర్ఎస్ వాళ్లు తీసుకున్నా కలిగే నష్టం ఏముంటుంది.. వాళ్లు మీ పార్టీ వాళ్లు.. అలాంటి వాళ్ల డేటాతో వాళ్లేం చేసుకుంటారు? ఇదంతా చూస్తుంటే దొంగే దొంగ అని అరిచారనే సామెత గుర్తొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: