తెలంగాణా సాధారణ ఎన్నికల్లో తాను స్వంతంగా పోటీచేయకుండా అధికారమధం తలకెక్కి పంతంతో తమఅస్థిత్వాన్ని మరచి కాంగ్రెస్ తో చేయికలిపి “మహాకూటమి” ని ఏర్పాటు చేసి తనను అధికార పీఠం నుండి లాగెయ్యటానికి  ఏపి ముఖ్యమంత్రి తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం అత్యంత అవమానకరంగా దయనీయంగా బెడిసికొట్టడంతో, ఆ తరుణానికే కాదు, అది ఇప్పటికీ రాజకీయాల్లో కేసీఆర్‌ది "పై చేయి” గానే ఉండిపోయింది.

Image result for return gifts from kcr to cbn

ఆ సమయంలో ఆ ఊపు లోనే,  నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా! అన్న వ్యూహంతోనే ‘చంద్రబాబుకు రిటర్న్-గిఫ్ట్ ఇవ్వబోతున్నాను’ అది మా తెలంగాణా సాంప్రదాయం బహుమతి ఇచ్చినందుకు ప్రతిగా తిరిగి బహుమతి ఇవ్వటం ఒక సాంప్రదాయం అంటూ చాలా సిన్సియర్ గా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్.

Image result for return gifts from kcr to cbn

అది మొదలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకారం అనే పదం నిఘంటువు నుండి మాయమై రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ – అంటే- తిరుగు బహుమతి అనేది "ట్రెండీ వర్డ్‌" గా మారిపోయింది. మాటల్లో అద్బుత పద ప్రయోగదారాప్రవాహం కేసీఆర్ శైలి. 

Image result for return gifts from kcr to cbn

అలా ఆయన నోటి నుండి జారిపడ్డ “రిటర్న్ గిఫ్ట్” అందరి నోళ్ళలోకి చేరింది.  అసలు “రిటర్న్ గిఫ్ట్” ఎలా ఇస్తారు? ఏ రూపంలో ఇస్తారు? అనే ప్రశ్న వేసుకున్న వారే ఆ సందేహానికి వారే సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటికే కేసీఆర్ నుంచి చంద్రబాబుకు కొన్ని రిటర్న్ గిఫ్టులు అందాయన్నది ఒక యధార్ధం. ఒక వాస్తవం.

Related image

1 తెలుగుదేశం ఇన్ అండ్ అవుట్స్ అంతా తెలిసిన పాతకాపు తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్-ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో ఒక కీలక నేత. ఒక బీసీ నాయకుడు. చంద్రబాబు నాయుడి బలాలు, బలహీనతలు అన్నీ బాగా తెలిసిన వ్యక్తిగా తలసాని శ్రీనివాస యాదవ్ ని, ఈ రిటర్న్-గిఫ్టుల విషయం లో కేసీఆర్ బ్రహ్మాండం విస్పోటనమయ్యెలా  – చంద్రబాబు కూష్మాండం బ్రద్దలయ్యెలా వాడేశారు.

Image result for return gifts from kcr to cbn 

అడపాదడపా తలసానిని ఏపీకి పంపి, అక్కడి రాజకీయాల మీద రెండు రాళ్లు వేయించి, చంద్రబాబు రాజకీయ బెటాలియన్‌ ని ‘కెలికిరావడం’ అంటే చాలదు కదా! 'మనసంతా కకావికలం చేసి వచ్చే పని'  కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యత.

Image result for return gifts from kcr to cbn 

ఆసలే యాదవుడు చలోక్తుల్లో కాస్త వెటకారం దట్టించి ఘాటైన తెలంగాణా యాస మసాలా వేసి - ఏపీలో యాదవ సామాజిక వర్గాన్ని చేరదీసి, చంద్రబాబును ఇరకాటం లో పడేసిన స్ట్రాటజీ  రిటర్న్ గిఫ్టుల్లో ఒక భాగం అనుకుంటున్నారు. తలసాని  నేతృత్వం లో గుంటూరులో ‘యాదవ గర్జన సభ’ అనే ప్రణాళిక సిద్ధం చేశారు తలసాని. కాని ఖర్చులేదు. వ్యూహం రసవత్తరం. బీసీలకు ఎంతో చేశాం! వారు మా వాళ్ళే అంటున్న టిడిపి గుండెల్లో రాయి పడేశారు తలసాని ద్వారా కెసీఆర్. ఇది తొలి రిటర్న్ గిఫ్ట్ గా చెప్పొచ్చేమో?

Image result for return gifts from kcr to cbn

2 “భావసారూప్యత” పేరుతో దేశ వ్యాప్త రాజకెయ పార్టీలన్నిటినీ తన “ఫెడరల్ ఫ్రంట్‌” లోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్, తాజాగా వ్యూహాత్మ కంగా ఏపిలో ప్రతిపక్షం వైసీపీని కూడా తన ఖాతాలో కలిపేసు కున్నారు. తెలంగాణా యువనేత కేటీఆర్‌ని లోటస్ పాండ్‌కి పంపి,  ఏపి యువనేత వైఎస్ జగన్‌మోహన రెడ్డితో ప్రాధమిక మంతనాలు జరిపించారు.


శత్రువు మిత్రుడు మిత్రుడే అనేది సహజ రాజకీయ సిద్ధాంతం నారా చంద్రబాబు నాయుణ్ణి ఓడించడంలో జగన్ తన పూర్తి సహకారం ఉంటుందన్న సంకేతాల్ని ఇచ్చినట్లే!


  • అంతర్జాలంలో ఉప్పొంగిన షర్మిల-ప్రభాస్ వ్యవహారం నుండి  ప్రారంభమైన రెటర్న్ గిఫ్టుల పరంపర, వివాదాస్పద ఓట్ల తొలగింపు వ్యవహారం దాకా అనేక పిర్యాదులు హైదరాబాద్‌లో పోలీస్ స్టేషణ్లలో నమోదయ్యేలా చేసి, వాటి దర్యాప్తును తెలంగాణా పోలీస్ ‘విచారణ పరిదిలో ఉండేలా’ చేశారు కేసీఆర్.
  • ఏపీ పోలీసుల మీద జనంలో అపనమ్మకం చింతమనేని, తదితర టిడిపి నాయకులు ప్రజలపై ప్రత్యేకించి మహిళల పై కొన సాగిస్తున్న దాష్టీకాల నుండి మొదలై వైఎస్ జగన్మోహన రెడ్డిపై హత్యా ప్రయత్నం నాటికి తారస్థాయికి చేరింది.
  • ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త హత్యకేసుతో ఆంధ్రపోలీసుల తీరుపై ప్రజలకు అసహ్యంపుట్టింది. వీలున్నంత వరకు ప్రాముఖ్యత సంతరించుకున్న పిర్యాదుల విచారణ తెలంగాణా పొలీసుల చేతుల్లొకి వచ్చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో పౌరపాలన సమర్ధవంతంగా లేదని, దానిపై అంతఃపుర రాజకీయ ప్రభావం ఎక్కువైందని ప్రచారం నింగినంటింది. ఇది చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తూవస్తున్న మరో రిటర్న్ గిఫ్ట్.


3 మూడేళ్ళుగా అవినీతి నిరోధక శాఖ గోడౌన్లలో మూలుగుతూ ప్రజల నోళ్ళలో ఎప్పట్నుంచో నలుగుతూ వస్తున్న “ఓటుకు నోటు కేసు” ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును ₹ 5 కోట్లిచ్చి కొనబోయారన్న ఆడియో వీడియో కేసులో “రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి” ని, ఆయనకు ₹ 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేం నరేందర్ రెడ్డిని ఇటీవల ఈడీ అధికారులు ఇంటరాగేట్ చేశారు.


మూడేళ్ళ పాటు స్థబ్దుగా వున్న ‘ఓటు కు నోటు కేసు’ లో ఆకస్మికంగా చేతనత్వం రావటం వెనుక కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అనే వ్యూహమేనని ప్రపంచలోనే అత్యంత మేలు జాతికి చెందిన టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. దీన్ని క్లైమాక్స్ కు తీసుకు వచ్చే క్రమానికి ముందుగానే చంద్రబాబు శకుని పాత్ర ను ప్రపంచం ముందుకు తెచ్చి అంటే “ఎక్స్‌పోజ్” చేస్తారనేది  టిడిపి భయం.

 

4 మరొకటి ఇప్పుడు ప్రజల్లో విస్పోటనం తో కలకలం సృష్టిస్తున్న “సమాచార చౌర్యం-డేటా థెఫ్ట్ కేసు" ఇది చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ ఆయువుపట్టు మీద కేసీఆర్ రిటర్న్- గిఫ్ట్ గా కొట్టే చావుదెబ్బ అనే అంటున్నారు.

Image result for id grid co data theft from ap by chandrababu &n  co

ఐటీ గ్రిడ్! అనే అంతఃపురానికి చాలా సన్నిహిత సంస్థలతో ఏపీలోని ఐదు కోట్ల ఓటర్ల డేటా బ్యాంకు చోరీ చేయించో? చేసో? ప్రజాప్రభుత్వం దగ్గర అత్యంత భద్రతలో సంరక్షించాల్సి ఉన్న సమాచారం అత్యంత నిర్లక్ష్యంగా అధికార పార్టీ ఎన్నికల అవసరాల కోసం తయారు చేసుకున్న - ప్రత్యేక డేటా బాంక్ ఎక్స్-క్లుజివ్ టెక్ సపోర్ట్ సాఫ్ట్-వేర్ కంపనీ "బ్లూ ఫ్రాగ్"  నిర్వహిస్తున్న టిడిపి పొలిటికల్ డాటాకు అనుసంధానించటం అనేది ప్రమాదకర అభియోగం.

Image result for return gifts from kcr to cbn

అలాంటి నేపథ్యంలో, హైదరాబాద్‌ లోని ఐటీ గ్రిడ్  అనే ఐటీ కంపెనీ ప్రాంగణంలో ఈ దుష్టకార్యం జరగటం ఆ పిర్యాదు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావటంతో – అది కూడా కూడా వచ్చి తెలంగాణ ప్రభుత్వ వలలో పడటం, చిన్న అవకాశం దొరికినా తెలంగాణా ప్రభుత్వం రిటన్-గిఫ్ట్ ఇచ్చే ఆచారం మొదలేట్టిన తెలంగాణా ప్రభుత్వం తన కొరడా ఝుళిపించింది.

Image result for return gifts from kcr to cbn

తెదేపా శ్రేణుల కోసం ప్రత్యేక యాప్‌ ని రూపొందించి, అందులో ఎన్నికల్లో వినియోగించాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాల్ని పొందుపరిచారు అన్నది అభియోగం. ఇది డేటా చోరీ కిందకే వస్తుందని, తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియా సమావేశంలో చెప్పారు.

Image result for jagan joins in federal front as return gift

ఇది తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో పాటు, నారా చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్ధాల సూధీర్ఘ రాజకీయ జీవిత ప్రతిష్టను ఆసాంతం కిందికి లాగేసి దెబ్బతీయ వచ్చని తెరాస భావిస్తోంది.

Image result for return gifts from kcr to cbn

ఇది భరించలేని ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువనేత ఏపీ ఐటీ మంత్రి లోకేష్ అమాయకంగా అనాలోచితంగా ‘మీరిస్తానన్న రిటర్న్- గిఫ్ట్ ఇదేనా?’ అంటూ నేరుగా ట్వీట్ చేయడం, తెలుగు దేశం పార్టీలోనే కాదు అంతఃపురంలోనూ ప్రకంపనలు పుట్టిస్తుంది.  మాటల్లోఉలికిపాటు అధినేతకు వచ్చిన గుండె పోటును తెలియజేస్తోంది. 

Image result for id grid co data theft from ap

దాదాపు చంద్రబాబు ఇదేవయసులో నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు వేశారు. అదే వృద్ధాప్యంలో చంద్రబాబుకు ముందుపోటో?  వెన్నుపోటో? లేకపోతే గుండెపోటో? పడబోతుంది. ఎందుకంటే తాతకు పెట్టిన బొచ్చె తలాపిన్నే ఉంటుంది కదా! చేసిన పాపాల ఫలితాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టేస్తున్నాయని చంద్రబాబును చిన్నప్పణ్నించి గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. చూద్ధాం! ఏం జరగబోతుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: