పీకే అంటే చాలా అర్ధాలు ఉన్నాయి. ఇపుడు రాజకీయాలో ఈ షార్ట్ ఫార్మ్ చాలా ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. నిన్ననే పీకే పీచమణచింది. మోడీ సర్కారు. అక్కడ పీకే అంటే అర్ధం పాకిస్థాన్. పీకే అంటే ఏపీలో జనసెన నేత పవన్ కళ్యాణ్ కూడా. ఆయన ఏపీలో రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. ఇక మరో పీకే కూడా ఉన్నారు.


ప్రశాంత్ కిషోర్ అంటే :


ఈ పేకే అంటే వైసీపీకి రాజకీయ  సలహాదారు ప్రశాంత్ కిషోర్ అన్న మాట. ఇపుడు ఏకంగా ఈయన గారి పేరు చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ మారుమోగుతోంది. పీకే సర్వేలు చేయడంతో దిట్ట. అంతే కాదు. ఓ పార్టీని అపజయాల నుంచి వియజ తీరాలకు చేర్చేందుకు ఎత్తులు పై ఎత్తులు  వ్యూహాలు అందించే పొలిటికల్ స్పెషలిస్ట్. నిజానికి పీకే ఇపుడు వైసీపీలో మాస్టర్ మైండ్ గా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఆయన వైసీపీకి సలహాదారుగా వచ్చారు. ఆ తరువాత వచ్చిన మార్పులు వైసీపీ గ్రాఫ్ పెరగడం అందరూ చూస్తున్నదే. వైసీపీ తప్పులను ఎప్పటికపుడు సరిచేస్తూ పీకే వేస్తున్న వ్యూహాలు ఇపుడు టీడీపీకి ఇరకాటంగా ఉన్నాయంటున్నారు. అందుకే ముగ్గులోకి ఆయన్ని కూడా తీసుకువచ్చారని అంటున్నారు.


బీహారీ పొలిటిక్స్ నా :


ఓ వైపు జాతీయ రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు బీహార్ రాజకీయాలు అంటూ ఓ రాష్ట్రాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అక్కడ గతంలోలా పరిస్థితి అయితే లేదు. అక్కడ సీఎమ్ నితీష్ పాలనలో బాగానే ఉందిపుడు. ఇక పీకే అన్న వ్యక్తి అక్కడ నుంచి వచ్చారు. ఇక్కడ అలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని బాబు విరుచుకుపడుతున్నారు. నిజానికి పీకే చేస్తున్నది వైసీపీ తప్పులను సరిచేయడమే. ప్రధానంగా ఆ పార్టీ మీటింగులు, హామీలు అన్నింటికీ ప్రచారంలోకి తీసుకురావడం.
ఇక అతి ముఖ్యమైన పని ఇపుడు పీకే టీం చేపట్టింది. అదే పోల్ మేనేజ్మెంట్. అది లేకనే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఈసారి అలా కాకుండా బూత్ లెవెల్ వరకూ ఓటర్లను తీసుకుపోయి ఓట్లు వేయించుకోవడంపై పీకే టీం గట్టి శ్రధ్ధ తీసుకుంటోంది. అక్కడే టీడీపీతో పీకేకు  గట్టిగా  పడుతోంది. అందుకే పదే పదే ఆయన్ని తలచుకుంటోంది. మరి పీకేని ఎంత కెలికితే అంత నష్టమేమో టీడీపీకి.


మరింత సమాచారం తెలుసుకోండి: