తెలుగు రాష్ట్రాల్లో డేటా యుద్ధం మరింత ముదిరింది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వైపు తెలంగాణ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి నివాసానికి ఏపీ పోలీసులు వెళ్లడం తాము చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత డేటాతో పాటు ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలు కూడా ఓ ప్రైవేటు సంస్థ వద్దకు ఎలా వచ్చిందనే విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Image result for it grids

మరోవైపు డేటా దుర్వినియోగం అయ్యిందని ప్రాథమికవిచారణలో తేలడంతో ఐటీ గ్రిడ్ కంపెనీ సీఈవో అశోక్ కి తెలంగాణ పోలీసులు నోటీసులిచ్చారు. రెండు రోజుల్లోగా అశోక్ సరెండర్ కాకపోతే అతన్ని అరెస్ట్ చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వానికి చెందిన కీలకమైన డేటా పబ్లిక్ వద్ద ఎలా ఉందని పోలీస్ కమినర్ సజ్జనార్ ప్రశ్నించారు. సేవా మిత్ర ముసుగులో ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరిస్తున్న కంపెనీపై కేసు నమోదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. అశోక్ కోసం ఏపీకి రెండు పోలీసు బృందాలను పంపిస్తున్నట్టు సమచారం.

Image result for it grids

మరోవైపు.. తెలంగాణ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న ఐటీ గ్రిడ్‌ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను హైకోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ ను న్యాయమూర్తి కొట్టివేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం నలుగురు ఐటీ గ్రిడ్‌ ఉద్యోగులను పోలీసులు విడిచిపెట్టారు. వీరిని CRPC సెక్షన్ 160 కింద విచారించామని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. అటు ఉద్యోగులు కూడా.. పోలీసులు తమను అరెస్టు చేయలేదని న్యాయమూర్తికి తెలిపారు.

Image result for it grids

ఇదే సమయంలో ఐటీ గ్రిడ్‌ కంపెనీపై మరో కేసు నమోదు దాఖలైంది. సేవా మిత్ర అప్లికేషన్‌ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటా చోరీ చేశారని వైసీపీ నేత రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామిరెడ్డి  ఫిర్యాదుతో ఆశోక్ పై IPC 420, 419 ,467, 468, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌ లో ఐటీ గ్రిడ్‌ పై కంప్లయింట్‌ చేశారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాంరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Image result for it grids

మొత్తానికి ఐటి గ్రిడ్ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి అగ్గి రాజేసింది. పౌరులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్  వెబ్ సైట్లలో ఉండాల్సిన డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించినట్లు కేటీఆర్ విమర్శించారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. టీడీపీ దొంగతనం చేసిందని.. తప్పు చేయనప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే... ఏపీ డేటాపై కేసు నమోదైతే విచారించడానికి మీరేవరని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీని దెబ్బ తీయ్యాలని చూస్తే.. మూలాలు కదులుతాయని హెచ్చరించారు. కేసీఆర్, జగన్ ల జోడీ కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్  డైరెక్షన్ లో టీడీపీ డేటా దొంగిలించారని ఆరోపించారు.

Image result for data war

ఐటి గ్రిడ్ వ్య‌వ‌హారం రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై అవసరమైతే ప్రభుత్వం తరపున న్యాయపోరాటం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఇవాల్టి కేబినెట్ లో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాక, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. రాజకీయంగానే కాక, ప్రభుత్వపరంగా, న్యాయపరంగా ఎదుర్కోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: