అదేంటో తెలియదు కానీ ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. పొరుగున వున్న తెలంగాణాలోనూ హీట్ పీక్స్ లో ఉంది. ఇక సమరమే అంటూ అటూ ఇటూ తొడలు కొడుతున్న సీన్లు ఇపుడు కనిపిస్తున్నాయి. అసలు ఇందంతా ఎందుకు.. దేని వల్ల వచ్చింది..


ఉలుకెందుకు బాబూ :


ఐటీ గ్రిడ్ చుట్టూ ఇపుడు ఏపీ, తెలంగాణా రాజకీయాలు నడుస్తున్నాయి. ఐటి గ్రిడ్ కి ప్రజల సమాచారం అంతా ఇచ్చేశారని, వ్యక్తిగత భద్రతకు ఇది ముప్పు అంటూ ఓ వైపు తెలంగాణా పోలీసులు కేసు విచారిస్తున్నారు. మరో వైపు మా డేటా దొంగతనం చేసి మామీద నిందలా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాట్ కామెంట్స్ చేయడం విశేషం.  గత మూడు రోజులుగా ఆయన నోటి వెంట మరో మాట లేదు, ఎంతసేపూ కేసీయార్, జగన్, మోడీ అంటూ విమర్శలు చేస్తున్నారు. మాతోనే పెట్టుకుంటారా ఖ‌బడ్దార్ అంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. దీని మీద ఈ రోజు టీయారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ట్వీట్ వేశారు. మీరన్నదే నిజమైతే అంత ఉలుకెందుకు బాబు గారూ అంటూ ఆయన లాజిక్ పాయింట్ ఒకటి తీశారు.


భయం అక్కర్లేదుగా :


నిజానికి ఐటీ గ్రిడ్ అన్నది టీడీపీ పార్టీ కోసమే ఉంటూ, పార్టీ కార్యక్రమాలే చూస్తూ వస్తున్న సంస్థ  అయింతే అంతలా చంద్రబాబు, లోకేష్ భయపడాల్సిన అవసం ఎంటన్నది జనాలకు కూడా అంతుపట్టడంలేదు. అదే పాయింట్ మీద ఇపుడు కేటీయార్ కూడా ట్వీట్ వేశారు. మీరు కరెక్ట్ అనుకున్నపుడు ఈ ఆవేశ కావేశాలు ఎందుకు, భారీ ప్రకటనలు ఎందుకు అంటూ కేసీయార్  అడిగిన ప్రశ్న మాత్రం ఆలోచింపచేసేదే. అంటే ఐటి గ్రిడ్ లో ఏపీ ప్రజల పూర్తి సమాచారం ఉన్నది అంటూ వస్తున్న న్యూస్ కరెక్ట్ అయినా అవాలేమో. లేకపోతే మొత్తం టీడీపీలో ఇలా ఉలికిపాటు, కలవరపాటు కనిపించడం నిజంగా విశేషమే మరి. ఈ కంగారుతోనే ముందు జనం ముందు దొరికిపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: