ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మన దురదృష్టం కొద్దీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వ విధి. ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయి మంత్రి మండలి ఏర్పరచిన తరవాత ఆయన ప్రభుత్వానికి బాధ్యత వహించాలి గాని పార్టీకి కాదు. అటు పార్టీ పై ఇటు ప్రభుత్వంపై పట్టు నిలుపు కోవటానికి ఒకే వ్యక్తి అటు పార్టీ అధ్యక్షుడై మరోవైపు ప్రభుత్వ అధినేతై అటు ప్రభుత్వాన్ని ఇటు పార్తీఇని గుప్పెట్లో పెట్టుకోబట్టే ప్రభుత్వం పార్టి మద్య ఉన్న చిన్న విభజన గీతను మర్చి పోతున్నారు. కాదు ఆ పేరుతో జాతికి దేశానికి తీరని ద్రొహం చేస్తున్నారు. 
Image result for it grids india company and lokesh
దాని పలితంగానే ప్రజల సమాచారాన్ని ప్రభుత్వాధినేత అధికార పార్టీ అధినేత ఓకటేఅయి ప్రభుత్వ భద్రతలో క్షేమంగా ఉండే ప్రజల సమాచారం ప్రైవేటు సంస్థలకు అందజేసి, పాటీగా ప్రయోజనం పొందుతూ ప్రతిపక్షాలను పాతరేసే వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరని జాతి విద్రోహానికి తీవ్ర నేఱానికి పాల్పడిందని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేసిన వారు తమ పదవికి రాజీనామా న్యాయంగా తప్పుకోవాలి. 
Image result for GVL narasimha rao on Data theft in ap
బీజేపీ ఎంపి జీవీఎల్‌ నరసింహారావు ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ మండిపడ్డారు. "ఐటీ గ్రిడ్స్‌ స్కామ్‌" పై ఆయన నేడు (మంగళవారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన సహించరాని చర్య అని అన్నారు. ఈ డేటాతో చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చే సరికి తన బండారం బట్టబయలౌతుందని చంద్రబాబు తీరని భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని విమర్శించారు.
Image result for GVL narasimha rao on Data theft in ap
డేటా చోరికి పాల్పడిన తనకు తానే రాజకీయ కురువృద్ధుడుగా చెప్పుకునే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం రీత్యా తన చేతిలోకి  వచ్చిన ప్రజా సమాచారాన్ని ఒక ప్రయివేట్ సంస్థ చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థను ఖూనీ చేశారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని, ఇక్కడ ప్రజల భద్రత, సమాచార గోప్యతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని వారెవరైనా కఠినంగా శిక్షించాలి. లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. 
Image result for GVL narasimha rao on Data theft in ap
ప్రభుత్వ ప్రయోజనాలు తమ పార్టీ వారికే చెందాలని చేసే అధికార పార్టీ దురాగతం క్షమించరాని నేరం. ప్రజలంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే కాదని - రాష్ట్రం లో నివసించే ఐదు కోట్ల జనవాహిని అని ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు. దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన వారిని పట్టుకుంటే శభాష్‌ అనకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వింత ఆరోపణలు చేస్తుందని, దీనికి కారణం అటు ప్రభుత్వం ఇటు పార్టీ మీద ఒక వ్యక్తి పెత్తనం లేదా ఒక కుటుంబ పెత్తనం కొనసాగించటమే ఇలాంటి దురాగతాలకు దారి తీస్తుందని పరోక్షంగా చెప్పారు. ఇది దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: