ఈ పదాలు ఏపీ ప్రజలు గత అయిదేళ్ళుగా వింటున్నారు. ఇంకా చెప్పాలంటే గత ఏడాదిగా ఇంకా ఎక్కువగా వింటున్నారు. ఈ  పదాలకు అర్ధాలు తెలియకపోయినా ఈ పదాలు మాత్రం జనం చెవుల్లో మారు మోగుతున్నాయి. మరి ఈ పదాలకు అంత పవర్ ఉందా.  ప్రతీ రోజూ అదే పనిగా వాడాల్సిన అవసరం వుందా..


పవర్ ఉందిగా :


ఈ మూడు పదాలనే నమ్ముకుని 2014 ఎన్నికల బండిని టీడీపీ అధినేత చంద్రబాబు లక్కొచ్చేశారు. కుట్ర పన్ని ఏపీని విడదీశారు.  వైసీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారు, నాపైన కక్ష సాధిస్తున్నారు అంటూ 2014 ఎన్నికల్లో చెప్పినమాటలనే చెబుతూ బాబు నానా యాగీ చేశారు. చివరికి అన్నీ కలసి వచ్చి సీఎం పీఠం పట్టేశారు. మళ్ళీ ఇపుడు అ పదాలను అమ్ముల పొదిలో నుంచి బయటకు తీశారు. గత ఏడాదిగా బాగా వాడేస్తున్నారు. బీజేపీతో ఎపుడైతే విడిపోయారో అప్పటి నుంచి ఈ పదాలు లేకుండా బాబు నోట మరో మాట రావడంలెదుగా.


పాత్రధారులు మారారు :


ఇక నాడు కుట్ర చేసింది కాంగ్రెస్, కుమ్మక్కు అయింది సోనియాగాంధి జగన్, కేసీయార్  కక్ష సాదించింది తన మీద. ఇలా చెప్పుకుని జనం సానుభూతిని బాగానే బాబు కొల్లగొట్టారు. మరిపుడు ఆ ప్లేస్ లో కొత్తగా వచ్చారు మోడీ. జగన్, కేసీయార్ ఇద్దరూ కామన్. ఇలా రాజకీయం వారి మీదకు తిప్పి 2019 ఎన్నికల్లోనొ మరో మారు అధికారంలోకి వద్దామని బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. తనపైన కక్ష సాధిస్తున్నారని గొంతు చించుకుంటున్నారు. 


వర్కౌట్ అవుతుందా :


మరి బాబు చెబుతున్నట్లుగా నమ్మి 2014లో జనం ఓట్లేశారు. పాపం కామోసు అనుకున్నారు. నిజమేనేమోనని కూడా భావించారు. అనుభవం కలిగిన సీఎం అంటూ అందలం ఎక్కించారు. ఇపుడు మళ్ళీ అవే మాటలను అంటే జనం సానుభూతి వర్షం ఓట్ల రూపంలో కురిపిస్తారా. ఓటుకు నోటు కేసు టైంలోనూ, ఇపుడు లేటెస్ట్ గా ఐటీ గ్రిడ్ స్కాం విషయంలోనూ బాబు అండ్ కో ఇలాగే మాట్లాడుతోంది. ఏపీలో ఏది కలసిరాకపోయినా కుట్ర అనడం బాబుకు అలవాటు అయిపోయిందని సెటైర్లు పడుతున్నాయి. మరి ఈ పదాలపైన బాబుకు ఉన్నంత ప్రేమ జనాలకు ఉందా. లేక విసుగు తెప్పిస్తున్నాయా. .కొద్ది నెలల్లో తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: