ఏపీలో వార్నింగుల‌ పర్వానికి తెరలేచింది. నిన్నటికి నిన్న మీ తోకలు కట్ చేస్తానంటూ ఆవేశంతో చంద్రబాబు చిత్తూరులో వూగిపోతే ఇపుడు జగన్ నెల్లూరు మీటింగులో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అధికారం ఇవాళ మీ చేతిలో ఉంది. రేపు నా చేతికి వచ్చాక అపుడు అవినీతి భాగోతాలన్ని బయటపెడతానంటూ గట్టిగా వార్నింగు ఇచ్చారు.


దొంగకు అర్ధం మారింది :


ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరించి  తన స్వార్ధం కోసం అమ్ముకుంటున్న చంద్రబాబు ఓ దొంగ, నేరస్థుడు, రాక్షసుడని వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరులో ఈ రోజు జరిగిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ దొంగే దొంగ అంటున్నారని, తిరిగి వైసీపీపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన బినామీ కంపెనీ అయిన ఐటీ గ్రిడ్ కి మొత్తం డేటాను అమ్మేశారని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ ఫోటోలతో సహా అక్కడ అంతా కనిపిస్తోందని, ఇది దారుణమైన నేరమని అన్నారు. ఇంతా చేసిన తరువాత కూడా వైసీపీ మీదనే నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అవినీతి, అక్రమాలకు చరమ గీతం పాడుతామని ఆయన స్పష్టం చేశారు.


ఎల్లో మీడియాకు కనబడవు :


కళ్ళకు కట్టినట్లుగా అన్నీ కనబడుతూంటే, ఎల్లో మీడియాకు ఏమీ కనబడవని జగన్ ద్వజెమెత్తారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం మన సమాచారాన్ని అమ్ముకుంటున్నారు.  రాష్ట్రంలో మొత్తం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలో 39 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల దగ్గర దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్‌ డేటా ఇదే తరహాలో చోరికి గురైంది. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఎన్నికల డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిది. ప్రజల సున్నితమైన డేటా చోరీ గురించి కేం‍ద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తల్ని దూషిస్తారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తారు’ అని మండిపడ్డారు.


సినిమాలు చాలు :


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి నాలుగున్నరేళ్ళ పాటు స్వార్ధం చూసుకున్న చంద్రబాబు మళ్ళీ ఓట్ల కోసం కొత్త డ్రామాలు మొదలెట్టారని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదాను అటకెక్కించింది బాబేనని, తిరిగి హోదా నల్ల చొక్కా వేసుకుంటున్నదీ ఆయనేనని అన్నారు. మరో వైపు డ్వాక్రా రుణాలు తీర్చకుండా మోసం చేసిన బాబు ఇపుడు పసుపు కుంకాలు అంటున్నారని, రైతులను రుణ మాఫీ పేరుతో నిండా ముంచేసి ఇపుడు అన్నదాతా సుఖీభవ అంటున్నారని జగన్ కామెంట్స్ చేశారు. తాము రెండేళ్ళ క్రితం ప్లీనరీలో ఇచ్చిన హామీలనే బాబు కాపీ కొట్టేసి జనం ముందుకు వచ్చారని, ఆయనకు తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: