ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు డేటా చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ లో ఆంధ్ర ప్రదేశ్ డేటా వెలుగు చూడటం తో రాజకీయంగా దుమారం రేపింది. ఏపిలో డేటా చోరీ జ‌రిగిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై విచార‌ణ చేస్తున్న సైబ‌రాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర అంశాలతో పాటు సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇప్పటిదాకా వెలువడ్డ సంచలన విషయాలకు మించిన సంచలనం మరొకటి బయటపడిపోయింది.

Image result for chandra babu

అదేంటంటే... ఐటీ గ్రిడ్ వద్ద ఉన్న ఏపీ ప్రజల సమాచారంలో సాక్షి దినపత్రిక చందాదారుల వివరాలు కూడా ఉన్నాయట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కటుంబం ఆధ్వర్యంలో సాక్షి పత్రికతో పాటు సాక్షి న్యూస్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఫ్యామిలీకి చెందిన ఈ పత్రిక రీడర్లలో మెజారిటీ ప్రజలు వైసీపీ సానుభూతిపరులు ఆ పార్టీ నేతలు కార్యకర్తలే ఉంటారు కదా. మరి ఈ వివరాలన్నీ కూడా సేకరించేసిన ఏపీ ప్రభుత్వం... ఆ వివరాలను ఐటి గ్రిడ్కు అందించడం చూస్తుంటే... ఈ వ్యవహారం భారీ స్థాయిలోనే సాగుతోందని చెప్పక తప్పదు. 


అసలు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను మాత్రమే సేకరించామని చెబుతున్న చంద్రబాబు అండ్ కో... సాక్షి రీడర్ల వివరాలనూ నమోదు చేసిందంటే ఈ కుట్ర మామూలుగా లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బయటపెట్టారు. డేటా చోరీపై జరుగుతున్న ప్రచారంపై స్పందించేందుకు నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్... ఐటీ గ్రిడ్ వద్ద సాక్షి రీడర్ల వివరాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: