తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు రేపుతున్న డాటా చోరీ కేసు రాను రాను రెండు రాష్ట్రాల మద్య మాటల యుద్దం పెరిగిపోతుంది.  ఓ వైపు ఐటి గ్రిడ్ ఏపిలో అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే..హైదరాబాద్ లో భద్రంగా ఉండాల్సిన డేటా ఎలా లీక్ చేస్తారు అంటూ అధికార పార్టీ ఆరోపిస్తుంది.  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన డేటా చోరీ కేసు ఈ రోజు కీలక మలుపు తిగిరే అవాకశాలు కనిపిస్తున్నాయి.  ఓ ఐటీ సంస్థకు అందజేసిందని ఓ ప్రైవేటు సంస్థ వద్ద ఇలా ప్రజల వివరాలన్నీ ఉంటే పరిస్థితి ఏమిటన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

  ఈ విషయంలో వైసీపీ నేతల నుంచి ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.  ఈ కేసులు ఎంత పెద్ద వారైనా విచారించాల్సిందే అంటు సీపీ సజ్జనార్ అంటున్నారు.   తాజాగా డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు  ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు నోటీసులు జారీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. దర్యాప్తులో తేలిన సంచలన విషయాల క్రమంలోనే లోకేశ్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల డేటా వివరాలన్నీ... నేరుగా లోకేశ్ కార్యాలయం నుంచే ఐటీ గ్రిడ్ సంస్థకు అందినట్లుగా సైబరాబాద్ పోలీసులకు పక్కా ఆధారం దొరికినట్టు తెలుస్తోంది.

అశోక్ తమ ముందుకు వస్తే గానీ.. ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందన్న భావనను వ్యక్తం చేసిన సిపి సజ్జన్నార్. అశోక్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. లొంగిపోవడానికి అశోక్ కు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో కోర్టు వారంట్ తో అశోక్ ను అరెస్టు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు ఎపి ప్రభుత్వం అశోక్ కు రక్షణ కల్పిస్తోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా నారా లోకేష్ కే నోటీసులు జారీ చేస్తే తప్ప కేసు కొలిక్కి రాదనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: