ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం డేటాని ప్రైవేటు సంస్థలకు ఏపీ ప్రభుత్వం అందించిన వార్తలు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు.

Image result for lokesh

ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన వార్త గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నారా లోకేష్ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.

Related image

ఎపి మంత్రి లోకేష్ అడ్డంగా వాదిస్తున్నట్లుగా ఉంది. ఆయన తండ్రి ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపి డేటా పోతే ఆ కేసు మాకు ఇవ్వాలి కాని, తెలంగాణ పోలీసులకు ఏమి సంబందం అని ప్రశ్నించారు. లోకేష్ మాత్రం ఒక అడుగు ముందుకు వెళ్లి అసలు ఎపి డేటా పోలేదని డబాయింపునకు సిద్దమైనట్లు ఉన్నారు.

Related image

ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డేటా పోయింద‌ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కలగన్నారా? అని ప్రశ్నించారు.ఏపీ సమాచారం పోలేదని ప్రభుత్వమే స్పష్టం చేసిందన్నారు. ఓటరు జాబితా సమాచారమంతా పబ్లిక్‌ డేటాయేనని ఎన్నికల సంఘమే తెలిపిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోయింది ఏపీ డేటా కాదు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ అని లోకేష్ చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: