ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ పాకిస్తాన్‌ కొరడా ఝుళిపించింది. జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ కొడుకు, సోదరుడు సహా నిషేధిత సంస్థలకు చెందిన మొత్తం 44 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకుందని దునియా న్యూస్ తెలిపింది. విచారణ నిమిత్తం జైషే చీఫ్‌ కొడుకు హమద్‌ అజహర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామని పాక్‌ హోం శాఖ వెల్లడించింది. 
Image result for masood azhar son and brother
మసూద్ అజర్ కుమారుడు సోదరులను  అరెస్ట్ చేశామని పాక్ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ కూడా మీడియా సమావేశంలో తెలిపారు. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకే ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాపాడేందుకేనని పేర్కొన్నారు.  
Image result for masood azhar son and brother
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయిద్‌ నేతృత్వంలోని జమాత్‌ ఉద్‌ దవా, దాని అనుబంధ సంస్థ ఫాలా ఈ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ ను పాక్‌ కొత్తగా నిషేధిత జాబితా లో చేర్చింది. ఈ రెండు సంస్థలు వాచ్‌-లిస్ట్‌ లోనే ఉన్నాయని భారత మీడియాలో వార్తలు వచ్చిన వెనువెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  ప్రభుత్వ సమాచారం ప్రకారం జమాత్, ఫాలాతో కలుపుకుని మొత్తం 70సంస్థలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. జమాతే, ఫాలా సంస్థల ఆస్తుల్నిస్థంభింప జేసినట్లు పాక్‌ ఇది వరకే ప్రకటించింది హఫీజ్‌ సయీద్‌ను అమెరికా 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని సమాచారం తెలిపిన వారికి 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. 
Image result for masood azhar son and brother
వ్యక్తులు లేదా సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అమలు చేయాలనే చట్టం సోమవారమే పాకిస్థాన్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

Image result for masood azhar son and brother

మరింత సమాచారం తెలుసుకోండి: