తెలుగుదేశం ఫార్టీ యియర్స్ పైగా అనుభవం కలిగిన పార్టీ. ఆ పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అందుకోవడం అసాధ్యమే. రేపటి ఎన్నికలు అత్యంత కీలకమైనవి కావడంతో అన్ని రకాల  అస్త్ర శస్త్రాలకు టీడీపీ రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో కీలకమైన డేట ఒకటి ఆ పార్టీ వద్ద ఉందని ప్రచారం సాగుతోంది.


వైసీపీ మొత్తం డేటా :


ఏపీలో టీడీపీని ఢీ కొట్టే పార్టీగా ఉన్న వైసీపీ డేటా మొత్తం ఇపుడు టీడీపీ వద్ద ఉందన్న ప్రచారం సంచలనం రేపుతోంది. అదే కనుక జరిగితే అది ప్రతిపక్ష వైసీపీకి దెబ్బ పడే వ్యవహారమే. భద్రంగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండాల్సిన డేటా ఇపుడు టీడీపీ చేతిలోకి ఎలా వచ్చిందన్నదే ఫ్యాన్ పార్టీ పెద్దలకు అంతు పట్టడంలేదట. ఈ డేటా లీకేజి పని వైసీపీలోని కోవర్టులే చేసారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయట. అంటే వైసీపీలో కూడా టీడీపీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారని అంటున్నారు.


బూత్ లెవెల్ వివరాలన్నీ :


ఇక టీడీపీ వద్ద ఉన్న వైసీపీ డేటాను తీసుకుంటే బూత్ లెవెల్ కన్వీనర్ వివరాలు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామాతో సహా అన్నీ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికలలో కీకలమైన తరుణంలో వారిని ప్రలోభపెట్టేందుకు ప్రత్యర్ధి పార్టీకి ఈ డేటా బాగా ఉపయోపడుతుందని అంటున్నారు. అలాగే వైసీపీ సానుభూతి పరులు, అభిమానులతో కూడిన జాబితా కూడా టీడీపీ వద్ద ఉండడంతో వైసీపీలో కలవరం రేగుతోందని అంటున్నారు. మరి దీన్ని బట్టి టీడీపీ టెక్నాలజీ, స్ట్రాటజీ ఏ రేంజిలో ఉన్నాయో అర్ధం చేసుకోవాలంటున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం వైసీపీకి ఎన్నికల ముందే పెద్ద దెబ్బ పడుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: