Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:43 am IST

Menu &Sections

Search

రాష్ట్ర డిజిపి ఆర్పీ ఠాగూర్ మునిసిపల్ పార్క్ స్థలం దురాక్రమణ! ఇక రాష్టం సంగతి?

రాష్ట్ర డిజిపి ఆర్పీ ఠాగూర్ మునిసిపల్ పార్క్ స్థలం దురాక్రమణ! ఇక రాష్టం సంగతి?
రాష్ట్ర డిజిపి ఆర్పీ ఠాగూర్ మునిసిపల్ పార్క్ స్థలం దురాక్రమణ! ఇక రాష్టం సంగతి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత రాజ్యాంగం,  దేశ నిర్ణయాత్మక విలువల పరిరక్షణకు, ప్రజా ప్రయోజనాలు సిద్ధించటానికి, శాసననిర్మాణ వ్యవస్థ - ఎక్జెక్యూటివ్ వ్యవస్థ - న్యాయవ్యవస్థ అనే మూడు స్థంబాలపై  ప్రజాస్వామ్యాన్ని నిర్మించింది. ప్రజలకు సమ న్యాయం జరగటానికి శాసన సభ నిర్ణయాలు చేస్తే దాన్ని సరిగా అమలు చేయటాని అధికారుల ఆద్వర్యంలో అధికార వ్యవస్థను పటిష్ట పరిచింది. న్యాయ పరిరక్షణకు న్యాయవ్య వ్యవస్థను మనకందించింది. 


అయితే ఎక్జెక్యూటివ్ వ్యవస్థ అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు తలొగ్గి బాధ్యతను విస్మరించి 'తానా అంటే తందానా' అంటూ విధి నిర్వహణ ప్రజల కోసం కాక తమ స్వార్ధ ప్రయోజనాల సాధనకు ఉపయోగించటమే సర్వ అనర్ధాలకు కారణం అవుతుంది. చాలా మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ పక్షపాతం కలిగి ఉండటం — అయితే దానికి మాంసం తింటున్నాం గదా! అని మెళ్ళో ఎముకల దండ వేసుకొని తిరగటం మంచిది కాదు కదా! ఎందుకో గాని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ బాస్ వ్యవహారం సాధారణంగా లేదు తీరు  అనుమానాస్పదంగా ఉంది.
ap-news-dgp-of-ap-rp-tagore
ఎపి డిజిపి ఆర్.పి ఠాకూర్ కు అప్రతిష్ట తెచ్చే విషయమే ఈ వార్త. ఆయన హైదరాబాద్ లోని ప్రశాసననగర్ లోని మున్సిపల్ కార్పొరేషన్ పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం చేశారని కార్పొరేషన్ న్యాయవాది హైకోర్టుకు తెలియచేయడం విశేషం. ఇటీవల తెలంగాణ హైకోర్టు మహానగరంలో అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా పలు అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. అందులో భాగంగా ఏపీ డీజీపీ ఇంటి ఆక్రమణలను తొలగించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివాసముండే జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని 149 నంబరు ప్లాటుకు యజమాని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ . అక్కడ జీ+1కు అనుమతి తీసుకుని మూడు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు.

ap-news-dgp-of-ap-rp-tagore

ఆగ్నేయ మూల  సెట్‌-బ్యాక్‌ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటివల్ల పక్కనే ఉన్న పార్కులో కొంతస్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ విషయమై జూన్‌ 4,  2017లో జీహెచ్‌ఎంసీకి ప్రశాసన్‌ నగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఫిర్యాదు చేసిందని, ఇంటి యజమానికి రెండుసార్లు నోటీసులిచ్చామని వివరించారు. యజమాని కోర్టును ఆశ్రయించారని, కానీ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసిందని బల్దియా పేర్కొంది. 

ap-news-dgp-of-ap-rp-tagore
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్ట్‌ లో వేసిన పిటిషన్‌ పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. 
 ap-news-dgp-of-ap-rp-tagore
తాము నోటీసు జారీ చేసిన తరువాత కూడా మళ్లీ పిర్యాదు రావటంతో,  పార్కులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారని వివరించారు. అనుమతి పొందిన ప్లాన్‌ కు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంపై కూడా నోటీసులు జారీ చేశామన్నారు. పార్కును అక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అనుమతి పొందిన ప్లాన్‌ కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది. 
ap-news-dgp-of-ap-rp-tagore

ఈ కేసులో కూడా డీజీపీ ఠాకూర్‌కు 24 గంటల సమయం ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌ల ధర్మాసనం నిన్న మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


జీహెచ్‌ఎంసీ అధికారులు సెక్షన్ 452(1) కింద ఇంటి యజమానికి నోటీసులు జారీచేయగా,  ఆయన సిటీ సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇటీవల కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్‌ను రద్దుచేయడంతో జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 636(1) కింద అధికారులు తుది నోటీసులు జారీచేశారు. పార్కులో చేపట్టిన ప్రహారి గోడ, ఇతర నిర్మాణాలను స్వల్పంగా కూల్చివేశారు. అయితే కౌంటర్ దాఖలుకు రెండువారాల గడువు ఇవ్వాలని డీజీపీ తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఈ నెల 11 నాటికి దాఖలు చేయాలని స్పష్టంచేసింది. 

ap-news-dgp-of-ap-rp-tagore
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
About the author