విచారణకు రమ్మని గడువు ఇచ్చినా రాకపోవటంతో ఐటి గ్రిడ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని అశోక్ అరెస్టుకు తెలంగాణా పోలీసులు రెడీ అవుతున్నారు. డేటా చోరి స్కాంలో కీలక వ్యక్తి అయిన అశోక్ కోసం పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చర్యలకు దిగారు. బెంగుళూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలులో పోలీసులు గాలిస్తున్నారు. అయితే, అశోక్ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలోనే టిడిపిలోని ముఖ్య నేతల సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

 

రెండు రాష్ట్రాల్లోను సంచలనంగా మారిన ప్రజల వ్యక్తిగత వివరాల లీకేజీ వ్యవహారంలో వైసిపి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ దే ముఖ్యపాత్రగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే తమపై వైసిపి నేతలు తీవ్ర ఆరోపణలు మొదలుపెట్టారో వెంటనే టిడిపి కూడా అలర్టయి వైసిపిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. దాంతో ఒకపార్టీపై మరొక పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర ఫిర్యాదులు చేసుకున్నాయి.

 

ఇదంతా ఇలావుంటే వ్యక్తిగత డేటా లీకేజి వ్యవహారంలో కీలక పాత్రదారి అశోక్ దొరికితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు. అందుకనే విచారణకు హాజరవ్వాలంటూ అశోక్ కు మూడు రోజుల క్రితమే నోటీసులిచ్చినా స్పందన లేదు. దాంతో అశోక్ ను ఎవరో దాచిపెట్టినట్లు అర్ధమైపోయింది. అందుకనే అశోక్ అరెస్టు కోసం పోలీసులు కోర్టుద్వారా ప్రొసీడవ్వాలని నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా ఏపి ప్రభుత్వంలో ఐటి మంత్రి నారా లోకేష్ కు కూడా విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం మొదలవ్వటంతో కలకలం రేగుతోంది. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: