డాటా చోరీ వివాదంపై తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన కొన్ని లా పాయింట్లు లాగుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగతనానికి గురైందని.. అమరావతిలోనే ఈ కుట్రకు తెర లేపారని అన్నారు.

 Image result for data theft in hyderabad


గత నెల 23వ తేదీనే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్ధలోకి వెళ్లారన్న పయ్యావుల... అశోక్ సహా.. పలువురు కీలక ఉద్యోగులను ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో విచారించారని తెలిపారు. మఫ్టీలో తెలంగాణ పోలీసులు చేసిన విచారణ దొంగతనం కిందే లెక్క. ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా.. ఉద్యోగులను బెదిరించి సమాచారం సేకరించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

 Image result for data theft in hyderabad


టీడీపీ డేటా దొంగతనం సజ్జనార్ కు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? తేలాలని పయ్యావుల అన్నారు. సైబరాబాద్ సీపీ కుట్రలో భాగస్వామా..? సైబరాబాద్ కమిషనర్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగింది. రెండో తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మూడో తేదీ నాటికి అశోక్ పరారయ్యారని ఎలా ప్రకటిస్తారు.

 Image result for payyavula keshav


నాలుగో తేదీ ప్రెస్ కాన్ఫరెన్సులో సైబరాబాద్ కమిషనర్ పత్తిత్తులా మాట్లాడారు. గత నెల 23వ తేదీనే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేశామని చెప్పగలిగే దమ్ము సైబరాబాద్ కమిషనరుకు ఉందా..? కేసీఆర్ అడుగులకు మడుగులొత్తకుండా.. సజ్జనార్ ఐపీఎస్ అధికారిగా వ్యవహరించాలి. ఈ రోజు గుంటూరు కేసు నమోదు చేస్తున్నాం.. రేపట్నుంచి సైబరాబాద్ కమిషనర్ పరారీలో ఉన్నారని ప్రకటించమంటారా..? అంటూ సవాల్ విసిరారు పయ్యావుల.


మరింత సమాచారం తెలుసుకోండి: