డాటా చోరీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మరోసారి చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోవడం సహించలేని ఆయన అనుకూల పత్రికలు ఇప్పుడు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నాయి. అబ్బే ఇది టీడీపీకి మాత్రమే పరిమితం కాదు అంటూ కొత్త కథనాలు వెలువరిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బురద అందరికీ అంటిస్తున్నాయి.

 



ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహా సమాచారాన్ని అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి స్థాయిలో వాడుకుందట.  వాళ్లకు తప్పు కానిది ఇక్కడ తప్పు ఎలా అయిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని ఆ కదనం తెలిపింది. ‘తెలంగాణ ఎన్నికల సమయంలో కాల్‌ క్యాంపెయిన్‌ పేరుతో ఒక పెద్ద మిషన్‌ను టీఆర్‌ఎస్‌ ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే ముందుండి నడిపించారు.

Image result for data theft in hyderabad



 ఇందులో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లో ఉండేవారిని వాలంటీర్లుగా చేర్చుకున్నారు. తెలంగాణ ఓటర్లకు ఫోన్లు చేసి టీఆర్‌ఎ్‌సకు ఓటేయాలని చెప్పడం ఆ వాలంటీర్ల బాధ్యత. ఈ మిషన్‌లో ఎక్కువమంది ప్రవాసులు చేరారు. దాదాపు 50 దేశాల నుంచి దీనిలో చేరారట. మరి వీళ్లందరికీ తెలంగాణ ఓటర్ల జాబితా, ఫోన్‌ నంబర్లు, వివరాలు ఎలా వచ్చాయి..? అని రాశారు.




అయితే ప్రభుత్వపరంగా సర్వే చేసి,వాటిలో ఎవరెవరికి ఎంత లబ్ది చేసింది, వారి బ్యాంకు ఖాతాలు తదితర వివరాలు కూడా ఉన్నాయా అన్నది ఈ కదనం లో కనిపించలేదు. కార్యకర్తల డాటా సేకరించడం తప్పుకాదు.. వారి ఫోన్ నెంబర్లు తీసుకోవడం తప్పు కాదు.. కానీ ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడమే తప్పు. ఆ తప్పును మాత్రం  పసుపు పత్రికలు చాకచక్యంగా దాచిపెడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: