నిన్నలా నేడు ఉండదు, రాజకీయాల్లో అసలే అది జరగదు, ఎప్పటికపుడు పరిణామాలు మారిపోతూంటాయి. దాంతో పాటే సమీకరణలూ మారుతూంటాయి. అందువల్ల ఇలాగే జరుగుతుందని వేసుకున్న అంచనాలు వ్యూహాలు కూడా గాడి తప్పవచ్చు.  బెడిసికొట్టవచ్చు, పీకల మీదకు కూడ వచ్చి మొత్తానికి మొత్తం సీరియస్ కావచ్చు.


సిట్ తో చెప్పేశారా :


ఐటి గ్రిడ్ స్కాం విషయంలో తాము  పూర్తి సీరియస్ గా ఉన్నామన్న సంకేతాన్ని తెలంగాణా సర్కార్ ఏపీకి చెప్పేసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్  ఆద్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం విశేషం. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా  ఇచ్చింది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ ఇంచార్జిగా వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రను నియమించారు.సిట్‌ బృందంలో సైబర్‌ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్‌, ఏసీపీ శ్రీనివాస్‌, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండనున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయనున్నారు. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్‌ను కేటాయిస్తున్నారు.


కొంప కొరివేనా :


విషయం ఇలా ఉంటే ఇంతవరకూ ఐటీ గ్రిడ్ స్కాం  గుట్టును ఎపిలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ,సంస్థలకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగా చేరవేసింది,దానిని ఏ విదంగా దుర్వినియోగం చేస్తున్నది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ డయాగ్రమ్ ప్రకారం వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. సేవా మిత్ర యాప్ లోకి ప్రభుత్వం వద్ద ఉండవలసిన ప్రజా సమాచారం రావడం,అక్కడ నుంచి ఐటి గ్రిడ్ కు, తర్వాత విశ్లేషణ,అక్కడ నుంచి కీ పర్సన్ కి,తిరిగి సేవామిత్ర యాప్ కు ,సూపర్వైజర్ కు ,అనంతరం వేరే పార్టీ వారి ఓట్లను తొలగిస్తున్న తీరును ఆయన చక్కగా వివరించారు. 


గుండెల్లొ దడే :


ఇక ఐటీ గ్రిడ్ కేసు మూలాల్లోకి వెళ్ళి  పూర్తిగా విచారణ జరపనుంది. అదే జరిగితే ఇందులో ఎవరు ఉన్నారో,  ప్రధానంగా తెర వెనక ఎవరు ఏమేం చేశారో అన్నది కచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. అపుడు ఏపీలో ఉన్న టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లుగానే తెలంగాణా పోలీసుకు చెప్పిన దాన్ని బట్టి అర్ధమవుతోంది. ప్రధానంగా  అధార్ కార్డుల వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారం, ఓటర్ ఐడీ మాస్టర్ కాపీ ఇలాంటివన్నీ కూడా ఐటీ గ్రిడ్  టీడీపీ అధికార్ యాప్ సేవా మిత్రలో దొరకడం టీడీపీకి ఇక్కట్లు తెచ్చే పరిణామమే. అందువల్లనే ఇపుడు ఏమీ చేయలేక ఎదురుదాడికే తమ్ముళ్ళు సిధ్ధపడుతున్నారని అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: