డాటా చోరీ కేసు ఏపీ సర్కారు పెద్దల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పైకి మేకపోతు గాంబీర్యం చూపిస్తున్నా.. ఈ కేసును తెలంగాణ సీరియస్ గా తీసుకోవడంతో ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

 

ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన కేసు విచారణ వేగంగా సాగుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాటలను బట్టి చూస్తే.. ఈ కేసు వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Image result for data theft in hyderabad 


ఈ కేసులో ఒక కీలక వ్యక్తి ఉన్నారని, ఆయనను కోడ్ భాషలో పిలుస్తున్నారని అంజన్ కుమార్ వెల్లడించారు. ఆ కోడ్ ను డీకోడ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం  వద్ద ఉన్న రహస్య సమాచారం సేవామిత్ర టిడిపి యాప్ లోకి వెళ్లిందని అంజన్ కుమార్ ధ్రువపరిచారు.

 Image result for data theft in hyderabad

సర్వేల పేరుతో ఈ యాప్ వాడారని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు మరింత లోతుగా జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. మరి ఈ కోడ్ బాషలో పిలుచుకున్న వ్యక్తి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అది నారా లోకేశ్ అనే అర్థం వచ్చేలా  జగన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: