జగన్ తాను నమ్ముకున్న దాన్ని బట్టే నడచుకుంటారు. ఆయనకు దైవ భక్తి, జనం మీద విశ్వాసం చాలా ఎక్కువ. వర్తమాన రాజకీయాల్లో జగన్ లాంటి నాయకులు చాలా అరుదు. ఇక ఎన్నికల రాజకీయంలో ఏమైన జరగొచ్చు. అద్భుతాలు ఆవిష్కరణ కావచ్చు, కాకపోవచ్చు. సరిగ్గా ఇలాగే జరగాలని మాత్రం ఏమీ లేదు.


అన్న నందమూరికి అలా :


ఇక విషయానికి వస్తే 1982లో అన్న నందమూరి తారక రామారావు టీడీపీని పెట్టారు.  తన ఎన్నికల హామీగా కిలో బియ్యం రెండు రూపాయలు అని చెప్పుకొచ్చారు. అది బాగా జనంలోకి వెళ్ళిపోవడంతో అప్పట్లో అధికారంలో  ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి దాన్ని కాపీ కొట్టి పది పైసలు తగ్గించు మరీ కిలో 1.90 పైసలకే ఇచ్చారు. అయితే జనం మాత్రం విజయభాస్కరరెడ్డిని కాదని నందమూరికే పట్టం  కట్టారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు జనం పడరు అనడానికి ఒదొక ఉదాహరణగా చెబుతారు. అయితే కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇదొక్కటే కారణం కాదు.


విసిగిన జనం :


అప్పటికే కాంగ్రెస్ నలుగురు ముఖ్యమంత్రులను మార్చడంతో విసిగిన జనం ఆ పార్టీని తొలగించాలని అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పైగా కాంగ్రెస్ లో  బహు నాయకత్వం ఉండడం,   పార్టీని, పాలనను పూర్తిగా గాలికి వదిలేయడం, మరో వైపు కాంగ్రెస్ కి అప్పటికి గట్టి ఆప్షన్ గా అన్న నందమూరి రావడం, ఆయన పార్టీ కొత్తదనం అన్నీ కలసి కాంగ్రెస్ ని ఓడించాయి. ఆ విధంగానే కాంగ్రెస్ కాపీ పధకం అభాసుపాలు అయిందనుకోవాలి.


ఇపుడు అలా ఉందా :


ఇక ఇపుడు చూస్తే చంద్రబాబు టీడీపీలో బలమైన నాయకుడు. ఆ పార్టీ వ్యూహాల ముందు ఎవరూ సాటి రారు. అత్యధిక పార్టీ సభ్యత్వం టీడీపీ సొంతం. ఇక ఇక్కడ జగన్ హామీలను బాబు కాపీ కొట్టి తనవిగా చేసుకోవడమే కాదు. విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నాటికీ నేటికీ రాజకీయాలే కాదు, జనం నైతికతలోనూ మార్పులు వచ్చాయి. అపుడు ఓటరు అమాయకుడు, ఇపుడు మెజార్టీ ఓటర్లు అవకాశవాదంతో ఉన్నారు.


పైగా ఇపుడు బాబు వ్యతిరేక ఓటు తీసుకునేందుకు ఒక్క వైసీపీ మాత్రమే లేదు. చాలా పార్టీలు చీల్చుకుంటాయి. ఈ రకమైన విశ్లేషణ చేసుకున్నపుడు 1983 నాటి కాపీ పేస్ట్ ఫార్ములా  రివర్స్ అవడం అన్నది  ఇపుడు వర్కౌట్ కాదని జగన్ గ్రహించాలి. అపుడు అన్నగారిని జనాలు  నమ్మడమే కాదు. కాంగ్రెసే  ఓటమిని అంగీకరించింది. ఇక ఇప్పటి విషయానికి వస్తే నిజానికి చాలా మంది జనాలకు జగన్ ఈ రకమైన హామీ ఇచ్చారన్న సంగతిని కూడా వైసీపీ నేతలు ప్రచారం చేయకపోవడం వల్ల అవి చంద్రబాబు పధకాలే అని కూడా అనుకుంటున్నారు.  ఇక్కడ బాబు గెలుపు కోసం చివరి వరకూ పోరాడే నేత. ఇవన్నీ బేరీజు వేసుకుని జగన్ జాగ్రత్తపడడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: