ఆంధ్ర ప్రదేశ్లో మౌన రాజకీయం రాజ్యమేలుతోంది. మొత్తం మైదానంలో ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ఆట మాత్రం వేరేలా ఉంది. ప్రేక్షకులు ఆట చూస్తారు. ఆటగాళ్ళు ఆడతారు. కానీ ఇక్కడంతా కడు భిన్నం.  మరి ఆ మౌన రాగాలేంటో అర్ధం కావడం లేదుగా.



రెండు పార్టీల గొడవేనా :


ఏపీలో ప్రస్తుతం ఓ కీలకమైన అంశంపై దాదాపు యుధ్ధమే జరుగుతోంది. డేటా చోరీ అన్నది ఆ అంశం. అయితే ఇది రెండు పార్టీల వివాదంగా, రెండు రాష్ట్రల మధ్య గొడవగా  మాత్రమే చిత్రీకరిస్తున్నారు. అలా కలరింగ్ వచ్చేసింది. అయితే తెలంగాణా పోలీసులు జరుపుతున్న విచారణల్లో చూసుకుంటే దిగ్భాంతికరమైన సమాచారం వెలుగు చూస్తోంది. టీడీపీ సేవా మిత్ర యాప్ లో అన్ని పార్టీలు ఉన్నాయి. వారి వివరాలు ఉన్నాయి. అలాగే అధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటర్ మాస్టర్ కాపీ వంటివి, వ్యక్తిగత వివరాలు ఉన్నాయి.


స్పందించరా :


మరి ఈ విషయంలో ఏపీలోని మిగిలిన పార్టీల స్పందన మాత్రం లేదు. బీజేపీ మాత్రమే రియాక్ట్ అయి గవర్నర్ ని కలసి వినతిపత్రం సమర్పించింది. ఇక కాంగ్రెస్ తీరు చూస్తే వైసీపీ, టీడీపీ గొడవ అంటూ కామెంట్ చేసి వూరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఇది రెండు రాష్ట్రాల గొడవ అంటున్నారు. సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు మౌన ముద్ర దాల్చాయి. మరి ఇక్కడ రాజకీయం కంటే కూడా జనం వ్యక్తిగత భద్రత గురించి చూడాల్సిన అవసరం ఉంది.   ప్రజల మొత్తం డేటా చోరీ  అయిందంటే అంతకంటే ఆందోళన కలిగించే విషయం మరోటి లేదు. కానీ మన రాజకీయ పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. దానికి అర్ధం ఏంటో వారే చెబితే బాగుంటుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: