ఏపికి తొందరలో కొత్త డీజీపి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ప్రస్తుత డీజీపి ఠాకూర్ వ్యవహారశైలిపై ఆరోపణలు రావటంతో పాటు వివాదాస్పదమవటంతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఏపికి కొత్త డీజీపిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకని ఐదుగురు సీనియర్ అధికారుల పేర్లతో ఓ ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

ఠాకూర్ వ్యవహార శైలి గురించి ఆలోచిస్తే దాదాపు అధికారపార్టీ మనిషిగానే వ్యవహరిస్తున్నారు. తానో సీనియర్ ఐపిఎస్ అధికారినని, నిష్పక్షపాతంగా తన విధులను నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందని ఠాకూర్ మరచిపోయారు. టిడిపి నేతలు ఫిర్యాదులు చేయటం వెంటనే వైసిపి నేతలపై కేసులు పెట్టటం అరెస్టులు చేసేయటం మామూలు అయిపోయింది.


వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా డీజీపి స్పందన అత్యంత వివాదాస్పదమైంది. హత్యాయత్నం జరిగిన గంటకే సానుభూతి కోసం, ప్రచారం కోసమే నిందుతుడు జగన్ పై హత్యాయత్నానికి పాల్పడినట్లు డీజీపి చెప్పటం పెద్ద వివాదానికి దారితీసింది.


 ఇటువంటి అనేక ఘటనల కారణంగా ఠాకూర్ ను వెంటనే మార్చాలని చీఫ్ ఎన్నికల కమీషనర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ వెంటనే స్పందించి ఐదు పేర్లతో ప్యానల్ పంపమని ఆదేశించింది. దామోదర్ గౌతమ్ సవాంగ్, వీఎస్ కె కౌముది, వినయ్ రంజన్ రే, ఎన్ వీ సురేంద్రబాబు, అనూరాధ పేర్లను పంపింది. కాబట్టి తొందరలోనే ఠాకూర్ డీజీపి గా వైదొలగక తప్పదనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: