కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందట..ఈ మద్య వైద్యులు చేస్తున్న వింత చేష్టలతో రోగుల ప్రాణామీదకు వస్తున్నాయి.  తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. వ్యాక్సిన్ వికటించి 15మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారులు నిర్ధారించడం లేదు.  ముందు జాగ్రత్త చర్యగా నీలోఫర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.   ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారుల్ని చికిత్స నిమిత్తం హెల్త్ సెంటర్‌ నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

నాంపల్లి హెల్త్ సెంటర్‌లో కలకలం... చిన్నారులకు వికటించిన వ్యాక్సిన్

వ్యాక్సిన్ తర్వాత నొప్పి రాకుండా ఇవ్వాల్సిన మందులకు బదులు వేరేవి ఇవ్వడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.  మరోవైపు  డాక్టర్లు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్నామంటు న్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image result for vaccine-in-nampally-health-center-

ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు అర్బన్ సెంటర్ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ మారడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.   దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్డీఎమ్‌హెచ్‌వో, ఆరోగ్య శాఖ అధికారులు నీలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: