పుల్వామా దాడిలో భారత్ సైనికులపై ఉగ్ర మూక జరిపిన దాడిలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు.  దీనికి ప్రతికారంగా భారత్ వాయుసేన పాక్ ఆక్రమిత స్థావరాలపై సర్జికల్ స్టైక్ 2 చేసి 300 మందిని హతమార్చింది.  అయినా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులుకు బుద్ది రావడం లేదు.  ఓ వైపు పాక్ శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది. 

భారత వింగ్ కమాండర్ అభినందన్ ని విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా తాము శాంతి మార్గంలో వెళ్తున్నామని చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..ఉగ్రవాద చర్యలు మాత్రం అరికట్టలేక పోతున్నారు.  సైనిక చర్యలపై మాట్లాడటం లేదు.  తాజాగా కాశ్మీర్ లో మరో బాంబు కలకలం రేగింది.   జమ్మూలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న బస్సులో బాంబు పేలింది. 
Image result for jammu bus stand bomb blast
ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ పరిసరాలను అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.  చుట్టు పక్కల ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: