ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే! డేటా చేరీకి సంబంధించిన తలెత్తిన ఈ సంక్షోభంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డేటా చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అయితే సిట్ దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో సిట్ చేసిన దర్యాప్తుల్లాగే ఇది కూడా కంచికి చేరుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 Image result for it grids india pvt ltd

          ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం ఓ ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉందంటూ హైదరాబాద్ లో దాఖలైన కేసుపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ దగ్గర ఈ సమాచారం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. ఆ సంస్థ సీఈవో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్, సైబరాబాద్ లలో ఈ సంస్థపై కేసులు దాఖలైన నేపథ్యంలో వాటన్నింటినీ సమన్వయం చేసుకునేలా సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9 మంది ఆధ్వర్యంలో ఈ టీం ఏర్పాటైంది.

 Image result for nayeem

          అయితే సిట్ దర్యాప్తులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో అనేక కేసులపై సిట్ ఏర్పాటు చేసి.. వాటిని కంచికి చేర్చారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇందుకు పెద్ద ఉదాహరణ.. నెలల తరబడి ఈ కేసు దర్యాపు చేసింటి సిట్. అకున్ సబర్వాలే నేతృత్వంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారించారు. టాలీవుడ్ మొత్తం ఈ దర్యాప్తుతో వణికిపోయింది. ఇది కచ్చితంగా టాలీవుడ్ కు మచ్చ తీసుకొస్తుందని ఇండస్ట్రీ మొత్తం భయపడింది. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు దాని ఊసే లేదు.

 Image result for miyapur land case

          నయీం ఎన్ కౌంటర్ వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. సుమారు 800 మందికి పైగా విచారించారు. 150 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వారిపై వందల్లో కేసులు నమోదు చేశారు. అయితే ఛార్జ్ షీట్ దాఖల్లో కాలయాపనే..! మియాపూర్ భూకుంభకోణం పైన కూడా సిట్ ఏర్పాటైంది. దాని సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. హఫీజ్ పేట్ భూ వ్యవహారంపైన దాఖలైన సిట్ కూడా ముందుకు కదల్లేదు. తాజాగా డేటా చౌర్యంపై నమోదైన కేసులపై కూడా సిట్ ఏర్పాటైంది. ఇది కూడా ఆ సిట్ లలాగే కొండెక్కుతుందేమననే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆరంభ హడావుడి తప్ప ఆ తర్వాత పెద్దగా పట్టించుకోరనే అపవాదు ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: