కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా గుర్తింపు సాధించిన ఆయ‌న గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక బలాన్ని సైతం నిరూపించుకున్నారు. ఇప్ప‌టికే దాదాపు 35 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నారు కోడెల‌. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడుని కూడా రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో త‌న కుమార్తె డాక్ట‌ర్ విజ‌య‌ల‌క్ష్మిని కూడా రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇప్ప‌టికే వార‌సుల వ్య‌వ‌హారాలు పెద్ద ఎత్తున పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న క్ర‌మంలో  చంద్ర‌బాబు కోడెల‌కు ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు. 

Image result for రాయ‌పాటి సాంబ‌శివ‌రావు

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌న కుమారుడు డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ‌కు టికెట్ ఇచ్చి తీరాల‌ని ఇప్ప‌టికే కోడెల చంద్ర‌బాబు వ‌ద్ద అల్టిమేట‌మ్ ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు సైతం న‌ర‌స‌రావుపేట నుంచి టికెట్ ఇచ్చేందుకు రెడీ అ య్యారు. అయితే, అదేస‌మ‌యంలో కోడెల‌ను ఎంపీ సీటుకు పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, దీనిపై ముందుగానే డిసైడ్ అయిన కోడెల‌.. జిల్లాలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని భావిస్తు న్నారు. రాయ‌పాటికి, ఆయ‌న కుమారుడికి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేప‌థ్యం లో తాను పార్టీలో సీనియ‌ర్‌న‌ని, పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్నాను కాబ‌ట్టి .. నాకు మాత్రం ఇవ్వ‌రా? అనే ధోర‌ణిని కోడెల ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

Image result for chandrababu

ఈ నేప‌థ్యంలో త‌మ ఫ్యామిలీకి రెండు టికెట్‌లు అది కూడా రెండు టికెట్లు త‌మ ఫ్యామిలీకి అసెంబ్లీవే కేటాయించాల‌నే పంతానికి పోతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌త్తెన‌ప‌ల్లి నియోజ క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తూనే.. త‌న కుమారుడుకి న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునేందుకు చ‌క్రం తిప్పుతు న్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ముందు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు సీనియ‌ర్లు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి. ఏదేమైనా కోడెల త‌న రాజ‌కీయ చాణిక్యాన్ని చాలా బాగా ప్లే చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఒకే కుటుంబానికి రెండు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తే.. మిగిలిన వారి సంగ‌తేంట‌ని?  కూడా ప్ర‌శ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: