వంగవీటి రంగా ఎన్టీఆర్ సినిమా అప్పట్లో మొదటి షో చూసేవారు... ఆయన కుమారుడు వంగవీటి రాధను పార్టీలోకి తీసుకోవడానికి బుద్దా వెంకన్న చంద్రబాబు హామీతో ఒక పదవిపై కూడా స్పష్టత పార్టీలోకి తీసుకు వస్తున్నారు. వల్లభనేని వంశీ చేసిన రాజకీయానికి వైకాపాలో నుంచి రాధ బయటకు వచ్చారు." ఒక రెండు నెలల నుంచి పదే పదే సోషల్ మీడియా వేదికగా తిరుగుతున్న మాటలు ఇవి. ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాధ విషయం కాస్త చల్లబడి ఇతర విషయాల మీద దృష్టి సారించారు. మరి రాధ వీళ్ళ అంచనాలకు తగినట్టు పార్టీలోకి వస్తారా...?

Image result for vangaveeti radha

బెజవాడలోనే కాదు కృష్ణా జిల్లా మొత్తం ఆసక్తి రేపిన అంశం ఇది. చంద్రబాబు కూడా దీనిపై కొన్ని మాటలు కూడా మాట్లాడినా రాధ మాత్రం ఇంకా తీర్ధం పుచ్చుకోలేదు. మరి ఆ తతంగం ఎప్పుడు పూర్తి చేస్తారు...? ఈ సమయంలో ఆయనను జనసేనలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కాపు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకోసం గోదావరి జిల్లాల నుంచి బాగా ఒత్తిడి వస్తుందనే ప్రచారం చేసారు. ఇక ఆయన రాక దేవినేని అభిమానులకు ఇష్టం లేదనే ఒక మాట కూడా పడేసారు కొందరు. ఈ తరుణంలో వచ్చిన రెండు వార్తలు సంచలనంగా మారాయి. 

Image result for ysrcp

ఏ పరిస్థితిని ఎలా వాడుకోవాలో చంద్రబాబుకి తెలిసిన విధంగా మరో నేతకు తెలియదు అనే చెప్పాలి... కొంత మంది కాపులు ఇప్పుడు జనసేనకు దగ్గరకాలేక, జగన్ కి ఓటు వెయ్యలేకా ఉన్నారు. అయితే మెజారిటి మాత్రం తెలుగుదేశానికే మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావం కాస్తో కూస్తే పడే గోదావరి జిల్లాల్లో కాపులు అటు మారే అవకాశాలు ఉన్నాయి. దీనితో అక్కడ రాధను తెలుగుదేశం నుంచి నిలబెడితే...? మాకు న్యాయం చేసారు అనే భావన కాపుల్లో రావడానికి ఎక్కువ సమయం పట్టదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఆ విధంగా పావులు కదుపుతున్నారు. 

Image result for tdp

నర్సాపురం లేదా ఆ జిల్లాల నుంచి ఒక పార్లమెంట్ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఒక హామీని లగడపాటి రాజగోపాల్ ద్వారా చంద్రబాబు ఇప్పించినట్టు సమాచారం. తాజాగా విజయవాడలో రాధతో లగడపాటి భేటి అయ్యారు... కోడెల శివప్రసాద్ తో భేటి అయిన అనంతర౦ విజయవాడ వచ్చి రాధను కలిసారి. ఆయనకు సీటుపై ఒక హామీని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. తొందరపడి ఏ ఆలోచనా చేయవద్దని ఎంపీ సీటు లేదా ఎమ్మెల్సి ఇవ్వడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారని లగడపాటి చెప్పినట్టు సమాచార౦. రాధ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో లగడపాటి విజయవాడ ఎంపీ గా ఉన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: