విశాఖ జిల్లా రాజకీయాలు మంచి దూకుడు మీద ఉన్నాయి. ఎన్నికలకు వేళ కావడంతో నాయకులంతా సర్దుకుంటున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన కీలక‌మైన నిర్ణయం తీసుకున్నారు.


ఈ నెల 9న చేరిక :


వైసీపీలో దాడి వీరభద్రరావు చేరేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ నెల 9న హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగే కార్యక్రమంలో జగన్ సమక్షంలో దాడి పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. దాడి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయన గతంలో నాలుగు సార్లు ఇదే సీటు నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. కాగా దాడి గతంలో అంటే 2012లో వైసీపీలో ఉన్నారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆ పార్టీకి అప్పట్లో రాజీనామా చేశారు. గత అయిదేళ్ళుగా రాజకీయాలకు దూరంగా కూడా ఉంటూ వస్తున్నారు.


ప్రత్యర్ధి అటు :


ఇక దాడి ప్రత్యర్ధిగా అనకాపల్లి రాజకీయాల్లో ఉన్న మరో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ టీడీపీలో చేరుతూండడంతో దాడి వైసీపీని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. కొణతాలను వైసీపీలో చేరకుండా జగనే అడ్డుకోవడం ఇక్కడ విశేషం. తన తల్లి విజయమ్మను విశాఖ నుంచి ఎంపీగా పోటీకి పెడితే కొణతాల సరిగా మ్యానేజ్ చేయకుండా ఓడించాడని జగన్ కి కొణతాలపైన చాలా  కోపం ఉందంటారు.  దాంతో దాడిని మళ్ళీ మళ్ళీ పార్టీలోకి తీసుకుంటున్నా కొణతాలకు మాత్రం నో ఎంట్రీ బోర్డ్ చూపించేశారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: