1 . ఏపీ ప్రజలు అనే కాదు దేశం లో ఏ రాష్ట్ర , జిల్లాల ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం ఏ ప్రైవేటు సంస్థ దగ్గర కూడా ఉండకూడదు .. ఇది అతిపెద్ద నేరంగా చూడాల్సిన అంశం . దీని గురించే లోకేస్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణా పోలీసులకి కంప్లైంట్ చేసారు .. 

Image result for chandrababu vs kcr


2. సేవా మిత్ర కావచ్చు ఏదైనా యాప్ కావచ్చు ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం పొంది ఉండకూడదు. ముఖ్యంగా కలర్ ఓటర్ కార్డు ఇప్పుడు ఆ యాప్ లో అనేకమంది వి కనిపిస్తున్నాయి . ఈ సమాచారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం లేదా - ఎన్నికల అధికారుల దగ్గర మాత్రమే ఉంటుంది. ఎలా లీక్ అయ్యింది అంటే ఎవ్వరూ మాకు తెలీదు అంటున్నారు 


Related image

3. రివర్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ జనాల యొక్క డేటా ఎలా వెళ్ళింది అనేది చెప్పడం మానేసి తమ రాష్ట్ర డేటా ని తెలంగాణా ప్రభుత్వం తస్కరిచింది అంటూ రివర్స్ కేసు పెడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకర విషయం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది అంటున్నారు నిపుణులు ..


Image result for chandrababu vs kcr

4.టీడీపీ సేవామిత్ర అనే యాప్.. టీడీపీ కార్యకర్తల యాప్. యాప్‌లో ఉన్న సమాచారం అంతా స్వచ్చందంగా వచ్చినదే. అందులో అక్రమంగా వచ్చిన సమాచారం ఏమీ లేదని టీడీపీ చెబుతోంది. కానీ ఏదో ఉందని… తెలంగాణ ప్రభుత్వం.. ఐటీ గ్రిడ్ సంస్థలో సర్వర్లను తీసుకుని మరీ ఢిల్లీకి వెళ్తోంది. ఏం బయటపడుతుంది అనేది చూడాలి మరి 


Related image

5. ప్రజాస్వామ్య దేశం లో ఓటు అనేది , వ్యక్తిగత సమాచారం అనేది చాలా కీలకం . ఇది దొంగతనానికి గురి ఐనప్పుడు ప్రభుత్వాల కంటే కూడా ముందుగా ఎలక్షన్ కమీషన్ బాధ్యత తీసుకుని గట్టిగా ప్రస్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేషనల్ ఎలక్షన్ కమీషన్ ఈ విషయం లో సైలెంట్ గా ఉండడం చాలా ఇబ్బందికర అంశం. ఈ దేశం లో డేటా చోరీ కొత్త పుంతలు తొక్కుతోంది అనడానికి ఈ కేసు నిదర్సనం 


మరింత సమాచారం తెలుసుకోండి: