చంద్రబాబునాయుడు చివరకు జయసుధకు కూడా లోకువ అయిపోయినట్లున్నారు. సహజ నటి జయసుధ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరబోతున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతున్నారంటే ఏదోలే అనుకోవచ్చు. ఎందుకంటే, వాళ్ళంతా సీజన్డ్ పొలిటీషియన్సు కాబట్టి వైసిపికి లాభమని అనుకోవచ్చు. అదే సమయంలో అటువంటి వాళ్ళు టిడిపికి దూరమవుతున్నారంటే ఆ మేరకు తెలుగుదేశానికి నష్టమని కూడా అనుకోవచ్చు.

 

అలాంటిది  జయసుధ రాజీనామాతో టిడిపికి వచ్చే నష్టమేంటి ? పోనీ వైసిపిలో చేరటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా లాభముంటుందా ? ఆమేమీ క్రౌడ్ పుల్లర్ కూడా కాదు. ఆమె ప్రచారానికి వస్తే జనాలు తండోపతండాలుగా వచ్చేయటానికి. ఏదో వైసిపి ఊపు కనబడుతోందనో లేకపోతే వైసిపి గాలి బలంగా వీస్తోందనో ఆమె కూడా వైసిపిలోకి వచ్చేస్తున్నట్లు కనబడుతోంది.

 

తెలుగుదేశంపార్టీలో ఉన్నదన్న మాటే కానీ ఏనాడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. పార్టీ విధానాలను కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కానీ జనాల్లోకి తీసుకెళ్ళిన దాఖలాల్లేవు. కాబట్టి ఆమె టిడిపిలోనే ఉన్నా బయటకు వచ్చేసిన ఆ పార్టీకి పెద్ద తేడా ఏమీ ఉండదనే చెప్పాలి. అదే సమయంలో వైసిపికి వచ్చే ప్లస్ కూడా ఉండదనే అనుకోవాలి. చెరువు నీళ్ళతో నిండుగా ఉన్నపుడు కప్పులు చేరుతాయి కదా జయసుధ వైసిపిలో చేరటం కూడా ఇలాంటిదే అనుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: