టీడీపీ అధికార ప్రతినిధి, మహిళా నాయకురాలు .. జనసేన చీఫ్ పవన్ మీద మల్లెపూలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే యామిని పై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించాడు. పల్నాడులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జనసైనికుల్ని అరెస్టులు చేసి చచ్చిపోయేలా కొడతా ఉంటే మాకు ఎంతో ఆవేదన గా ఉంటుంది.. టీడీపీ నాయకులకు  ఆ నాయకురాలికి ఒకటే చెబుతున్నా.. నేను మిమ్మల్ని గౌరవిస్తాను.

Image result for pavan kalyan jansena

మీరు నన్ను విమర్శించండి.. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఖండించండి. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా నా వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఊరుకోను.. అసలు నా వ్యక్తిగత జీవితం గురించి మీకు ఏం తెలుసు..  అంత పెద్ద విలువలు ఉన్నాయా మీ అందరికీ..? నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయా.?’ అని యామినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు. 2014లో తాను మిమ్మల్ని భూజాలపైన ఎత్తి గెలిపించాను. ఆ రోజు మీ జెండాలు మోసింది మా జనసైనికులు కాదా.. ఇప్పుడు వారి మీద కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతారా’ అని పవన్ ప్రశ్నించారు.

Image result for yamini tdp

ఇలాంటి కేసులకు గొడవలకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు గుర్తుపెట్టుకోండి అని   హెచ్చరించారు. ‘తెగించే వాళ్లం మేం.. మీరు నియంత్రణ పాటిస్తే.. మేం పాటిస్తాం.. మీరు హద్దులు దాటితే దాన్ని మించి దాటేస్తాం.. మర్చిపోకండి.. మొదటి తప్పు మేం చేయం.. బాధ్యతగా వ్యవహరిస్తాం’’ అని పవన్ కళ్యాణ్  తీవ్ర స్వరంతో టీడీపీని హెచ్చరించారు. ఇక పవన్ తన ప్రసంగంలో మంత్రి నారా లోకేష్ ను కడిగిపారేశారు.. ‘ సర్పంచ్ గా గెలవని వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యాడంటే అందులో వాస్తవం ఉంది. తప్పుంటే ఖండించండి’ అని పవన్ చెప్పుకొచ్చారు. అంతే తప్ప పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఇది 2009 కాదని.. 2019 అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: