తెలంగాణ ఎన్నికల్లో  చంద్ర బాబు జోక్యం చేసుకోవటం ... కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పడం మనం చూశాం. అయితే కేసీఆర్ ఇప్పుడు వాటిని అమలు చేసుకుంటూపోతున్నాడు. టీడీపీ నిర్వహిస్తున్న సేవా మిత్ర యాప్ దుర్వినియోగం అయ్యిందని..  ఏపీ ప్రజల డేటాను ఐటి గ్రిడ్స్ అనే ఐటీ సంస్థ దొంగిలించిందని ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేసి దీనిపై టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.

Image result for kcr and chandrababu

ఇందులో చంద్రబాబు సహా టీడీపీ నేతల ప్రమేయంపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమై ఉంది..ఆ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మరోసారి ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. తాజాగా 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం.. చంద్రబాబు సంభాషణల మరో వీడియో లీక్ అయ్యింది.  సాక్షి టీవీలో ప్రసారమైన ఈ వీడియోల్లో రేవంత్ - సెబాస్టియన్  - ఎమ్మెల్యే స్టీపెన్ సన్ తో సాగించిన బేరాసారాలు కనిపిస్తున్నాయి.

Image result for kcr and chandrababu

దాదాపు 11 నిమిషాలు ఉన్న ఈ కొత్త వీడియో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో సెబాస్టియన్ చంద్రబాబు పేరు ను ప్రస్తావించి మీకు న్యాయం చేస్తాడని డైరెక్ట్ గా అన్నట్టు ఉంది. ఈ వీడియో ఈరోజు లీక్ కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు  తీవ్ర ఇరకాటంలో  పడ్డారు.ఇలా వరుసగా తెలంగాణ కేంద్రంగా బాబుకు వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతుండడం చంద్రబాబును ఉలికిపాటుకు గురిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: