డేటా చోరీ కేసు మరో మలుపు తిరుగుతోంది. ఐటీ గ్రిడ్స్ రూపొందించిన సేవా మిత్ర యాప్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల డేటా మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల డేటా కూడా ఉందని సిట్ ప్రత్యేక అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. తెలంగాణ డేటా ఎలా వచ్చింది.. ఆ డేటాతో ఏంటి పని అంశాన్ని విచారించాల్సి ఉందని ఆయన తెలిపారు.

Image result for stephen ravindra

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ కంపెనీ దొంగలించిందంటూ హైదరాబాద్ లో నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి డిజిటల్ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఆ పార్టీకోసం సేవా మిత్ర యాప్ రూపొందించింది. ఇందులో టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తల వరకూ సమాచారం పొందుపరిచేందుకు ఉద్దేశించిందని టీడీపీ చెప్తోంది. ఇందులో 65 లక్షల మంది టీడీపీ సైనికుల డేటా ఉందని వివరించింది.

Image result for it grids

అయితే... టీడీపీకోసం రూపొందించిన ఈ యాప్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని భావించి చట్టపరంగా కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు. అయితే అందులో అలాంటి సమాచారమేదీ లేదని టీడీపీ వాదిస్తోంది. అయితే కేసు తమ దగ్గర నమోదైంది కాబట్టి ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Image result for it grids

కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించిన స్టీఫెన్ రవీంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 9 మంది అధికారులతో టీం ఏర్పాటైందని తెలిపారు. నమోదైన కేసులన్నింటిపైనా సమగ్రంగా విచారణ జరుపుతామన్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ అధినేత అశోక్ అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా పట్టుకుంటామని స్పష్టం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల డేటా ఉండడం ఇందులో ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని ఎందుకు వాడుకున్నారో విచారణలో తేలాల్సి ఉందన్నారు. సమాచారానికి సంబంధించి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీడియా కూడా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: