IT Grids Data Theft Case, CP Anjani Kumar Explains With Map
డేటా చోరీపై "ఎన్నికల కమిషన్‌" కు ఫిర్యాదు చేసిన అనంతరం "సేవా మిత్ర" లో ఉన్న "కొన్ని యాప్స్‌" తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని సంచలన విషయం స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడి చేశారు. ఈ విషయమే అత్యంత కీలకం. ఒక "రాజ్యాంగ సాధికార సంస్థ" సమాచారం ఇచ్చిన తరవాత యాప్ లో మార్పులు చేయటం తొలగించటం మూసేయటం లాంటి వన్నీ ఖచ్చితంగా నేఱాలే.


అంటే ఐటీ గ్రిడ్స్ పాత్రంతా అనుమానాస్పదమే. ప్రజలకు చెందిన ఈ కీలకసమాచారం బాంక్ ఖాతాలు, ఆధార్ కార్డ్ వివరాలు ఈ సందర్భానికి అవసరం లేని కీలమైన అంశాలు. వాటిపై ఐటీ గ్రిడ్స్ ఫోకస్ చేసిందంటే - ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రజల కు కీడు చెసే ప్రయివేట్ వ్యక్తుల స్వార్ధం ఉన్నట్లే.  అందుకే ఇదెంతో కీలక పాత్ర సంతరించుకుంది.  

Image result for stephen ravindra about it grids and data theft

ఐటీ గ్రిడ్స్ కంపెనీ సమాచార చౌర్యం (డేటా చోరీ) కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని పోలీస్ ఐజి మరియు ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్, స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే చాలా పురోగతి సాధించినట్లు తెలిపారు. డేటా చోరీ కేసుకు సంబంధించి ఆయన గురువారం (మార్చి 7) సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలంగాణ ప్రజల డేటాను కూడా తీసుకుందని మరో కొత్త విషయం తెలిపారు. 

Image result for stephen ravindra about it grids and data theft
ఈ కేసులో ప్రధాన నిందితుడు దారవరపు అశోక్ అమరావతి లో ఉన్నా, అమెరికా లో ఉన్నా పట్టుకుంటామని చెప్పారు. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు. 
"కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. డేటా చోరీ లో ప్రమేయం ఉన్నవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. సున్నితమైన ఈ డేటా ఆధారంగా ఓట్ల తొలగింపు జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. నిందితులు ఎవరైనా సరే, వది లేది లేదు. చట్టం ముందు అందరూ సమానులే. అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నాం. దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 
Image result for stephen ravindra about it grids and data theft
ఐటీ గ్రిడ్స్‌ తో పాటు మరి కొన్నిసంస్థలు డేటా చోరీ కి పాల్పడినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీ తో పాటు ఇంకా ఈ కేసులో వేరే ఐటి సంస్థలు ఏమైనా భాగం పంచుకున్నారా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేక అనుమానాలు వచ్చాయని తెలిపారు. సిట్‌లో తొమ్మిది మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని తెలిపారు. 
Image result for stephen ravindra about it grids and data theft
ప్రజల వ్యక్తి గత సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చింది? విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రైవేట్ సంస్థ కు ఎవరిచ్చారు? ఎలా యిచ్చారు?  తెలంగాణ ప్రజల డేటాతో వారు ఏం చేయాలని అనుకున్నారు?  వివిధ అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కేసు దర్యాప్తులో మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నాము అని చెప్పారు.
Image result for CP anjani kumar
డేటా చోరీ పై ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవా మిత్రలో ఉన్న కొన్ని యాప్స్‌ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.  ఈ కేసుకు సంబంధించిన పురోగతిని ప్రతి రోజు మీడియాకు వెల్లడిస్తామని సిట్ చీఫ్ చెప్పారు. కేసు విషయంలో మీడియా కాస్త సంయమనం పాటించా లని సూచించారు. కేసులో దోషులను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు.


హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తు న్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఉన్న వేళ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ కీలక వివరాలు తెలిపారు. ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో టీడీపీ కీ-పర్సన్‌ అనే కోడ్‌ తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. టీడీపీకి ఈ ‘కీ’ పర్సన్స్‌ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్‌ వ్యవహారంలో ఆన్‌లైన్‌లో జరిగే కీలక పరిణామాలను మ్యాప్‌ రూపంలో సీపీ వివరించారు.

Image result for stephen ravindra about it grids and data theft

ఏపీ ప్రజలకు చెందిన ఆధార్, ఓటర్ ఐడీ లాంటి సున్నితమైన సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. టీడీపీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్‌ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజల ఆధార్‌ నంబర్‌, సామాజిక వర్గం, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ పరిశీలిస్తోందని.. అనంతరం ఈ సమాచారాన్ని టీడీపీ బూత్‌ కన్వీనర్లకు చేరవేస్తున్నారని... వారు పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులను గుర్తించి.. తమ ఓట్లను తొలగించాలంటూ ఆయా ఓటర్లే కోరుతున్నట్లుగా దరఖాస్తు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.    

Image result for seva mitra app strategy

  • సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సేకరించింది.
  • దీని ఆధారంగా ఇక్కడి కాల్‌ సెంటర్‌లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు.
  • వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్‌లోడ్‌ చేస్తారు.
  • ఈ డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది.* దీన్ని నియోజకవర్గాల్లోని బూత్‌ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది.
  • క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్‌ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్‌ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు.
  • ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు పంపిస్తారు.
  • ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను టీడీపీ ‘కీ’ పర్సన్‌ కు పంపిస్తుంది.
  • యాప్‌ లో వీరికి ‘టీడీపీ కీ-పర్సన్‌’ అనే కోడ్‌ వర్డ్‌ ఇచ్చారు.
  • టీడీపీ కీ పర్సన్‌ తనకు అందిన ఫైనల్‌ జాబితాలోని ఓటర్లు టీడీపీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు.
  • వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్‌-7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్‌ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు.
  • సేవా మిత్ర సర్వే లో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు.
  • సర్వే సమయంలో అందుబాటులో లేనివాళ్లు, పోలింగ్‌ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులుఅనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: