గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. అయితే మంత్రిగా ఉన్న నారా లోకేష్ చాలా బహిరంగసభలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.

Image result for lokesh

ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పలు అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చిన నారా లోకేష్ త్వరలో రాబోతున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నుండి అత్యధిక మెజార్టీ ఓట్లు కొల్లగొట్టడానికి అన్ని విధాలా రెడీ అయినట్లు టిడిపి పార్టీ నుండి వస్తున్న సమాచారం.

Image result for lokesh

ఈ క్రమంలో తనయుడు నారా లోకేష్ పోటీ గురించి తండ్రి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ 2019 ఎన్నికల పోటీ గురించి తల పట్టుకుంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

Related image

ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో లోకేష్ ని ఎక్కడి నుండి పోటీ చేయించాలి అనేది ఇంతవరకు కూడా ఖారారు కాలేదు. దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాగా, కేవలం లోకేష్ కోసమని భీమిలి నియోజకవర్గం కేటాయించాలని అనుకున్నారు. కానీ అది తేలేట్లుగా లేదు. ఈ క్రమంలో ఇటీవల విశాఖ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న శాసనసభ్యులతో సమావేశమైన చంద్రబాబు భీమిలి నియోజకవర్గం నుండి నారా లోకేష్ ని పోటీ చేయించాలని నేతలతో ముట్టడించినప్పుడు అక్కడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు లేవనెత్తిన అంశానికి సుముఖంగా ఉన్నారని...ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలి అని చంద్రబాబు కోరినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: