వైఎస్ జగన్ కుటుంబం మొత్తం దాదాపుగా రాజకీయాల్లో ఉందనే చెప్పాలి. గత నలభయ్యేళ్ళుగా వైఎస్సార్ కుటుంబం తెలుగు వారితో మమేకం అవుతూ వస్తోంది. ఇక వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం జనంలో ఎంతో మార్పు తీసుకుకువచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన పధకాలను  ఇప్పటికీ ప్రజలు తలచుకుంటారు. ఆయన స్కీములను మిగిలిన పాలకులు పూర్తిగా  అనుసరిస్తున్నారు కూడా.  మరణించినా జనం గుండెల్లో వైఎస్సార్ గూడు కట్టుకుని ఉన్నారు.


ఉత్తరాంధ్రలో పెరిగిన బలం :


ఇక వైసీపీని స్థాపించిన జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకువద్దామనుకుంటున్నారు. అందుకోసం అలుపెరగని పోరాటమే చేశారు. పద్నాలుగు నెలల పాటు జగన్ చేసిన పాదయాత్ర దేశంలోనే ఓ రికార్డ్. జగన్ ఉత్తరాంధ్ర పాదయాత్ర సూపర్ హిట్ అయింది. దాంతో ఆ పార్టీ బలం కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో జగన్ కుటుంబం నుంచి ఒకరు ఈ జిల్లాల నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. జగన్ రాయలసీమ కడపతో పాటు, కోస్తా జిల్లాల్లో మరో చోట పోటీకి రెడీ అవుతారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలను కవర్ చేయడానికి ఆయన కుటుంబం  నుంచి మరొకరు దిగుతారని చెబుతున్నారు. 


విజయమ్మ పోటీ :


ఇక విశాఖ ఎంపీ సీటుకు 2014 ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేశారు. అప్పట్లో సరైన పోల్ మేనేజ్మెంట్ లేకపోవడం, జగన్ లోకల్ గా  కొందరిని నమ్మి మోసపోవడం వల్లనే విజయమ్మ ఓడిపోయారని అంటున్నారు. ఇపుడు పరిస్థితి మారింది. జగన్ ప్రతీ చోటా ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారు. ఆచీ తూచీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సీటుకు విజయమ్మను పోటీకి పెడితే ఈసారి గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది. 


ఆమె వైఎస్సార్ సతీమణిగానే కాకుండా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా అందరికీ పరిచయమే. అంతే కాదు. గతంలో ఆమె కూడా ఏపీవ్యాప్తంగా పర్యటించారు. ఇక విశాఖ ఎంపీ సీటుకు వైసీపీకి సరైన అభర్ధులు కూడా లేరు. దీంతో విజయమ్మను పోటీకి పెడితే ఆ ప్రభావం మిగిలిన జిల్లాలకు కూడా ఉంటుందని దాంతో వైసీపీకి మొత్తం పరిస్థితి అనుకూలిస్తుందని ఒక వాదన ఉంది. చూడాలి. జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: