ఏపీలో రాజకీయం ఎన్నికల అధికారులను సైతం ఇబ్బంది పెడుతోంది. ఓట్లు తొలగింపు కోసం ఫాం 7 దరఖాస్తుల వ్యవహారం ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. ఓట్లను తొలగించాలం టూ చేసిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 55 వేల పైచిలుకు నకిలీ దరఖాస్తులు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం పరిశీలనలో తేలింది.

ap form 7 election commission కోసం చిత్ర ఫలితం


 

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 8.7 లక్షల దరఖాస్తుల పరిశీలన విడతల వారీగా చేపడుతున్నామని ఈసీ స్పష్టం చేస్తోంది. తొలివిడతగా 1 లక్షా 61 వేల 5 దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అందులో అసలైనవి 5 వేల 309గా తేల్చింది. మిగతావి దురుద్దేశ పూర్వకంగా వచ్చిన ఫాం 7 దరఖాస్తులుగా గుర్తించింది.




లక్షా 55 వేల 696 దరఖాస్తులు దురుద్దేశ పూర్వకంగా దాఖలైన నకిలీ దరఖాస్తులుగా గుర్తించి తిరస్కరించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని ఈసీ స్పష్టం చేస్తోంది. ఫాం 7 ఆన్ లైన్ లో దరఖాస్తు చేయగానే ఓటు తొలగించినట్టు కాదని ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 ap form 7 politics ysrcp tdp కోసం చిత్ర ఫలితం



ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయించటం మొదలు పెట్టగానే ఫాం 7 దరఖాస్తులు నిలిచి పోయాయని అధికారులు వెల్లడిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం కూడా సరికాదని ఈసీ ఫైర్ అవుతోంది. పొలిటికల్ పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని అధికారులు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: