ప్రస్తుతం ఏపీ ఎన్నికల జాబితాలో బోలెడు తప్పులు తడకలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే లక్షల్లో ఓట్లు గల్లంతు అయ్యాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు కూడా గల్లంతు అయిందంటే అంత కంటే దారుణం వేరోక‌టి లేదు. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు కూడా  తొలగించారని చెబుతున్నారు. అంటే పెద్ద వాళ్ళకే దిక్కులేని ఈ పరిస్థితుల్లో ఈ జాబితాను పెట్టుకుని రేపటి ఎన్నికల్లోకి వెళ్తే...


మార్పులు చేర్పులు :


ఓ వైపు చూస్తే ఎన్నీల షెడ్యూల్ వచ్చేస్తోంది. ఇంకోవైపు చూస్తే దాదాపు 55 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు అయ్యాయని ప్రధాన పార్టీ  వైసీపీ ఆరోపణ చేస్తోంది. ఇక రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు, తటస్తులు  లక్షల్లో తమ ఓట్లు పోయాయని చెబుతున్నారు. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఉన్నది చూస్తే తక్కువ సమయం. ఓ వైపు డేటా చోరీ హడలెత్తిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏళ్ళుగా ప్లాన్ గా ఓటర్ల పేర్లు  గల్లంతు చేస్తూ వస్తున్నారన్న  రాజకీయ ఆరోపణలు  గట్టిగా ఉన్నాయి. మరి వీటిని సరిదిద్దే పరిస్థితి ఉందా.


ఎవరికి లాభం :


ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయకుండా ఎన్నికలకు వెళ్తే అక్రమార్కులకే అవకాశాలు ఉంటాయన్నది నిజం. తెలంగాణా ఎన్నికల వేళ లక్షల్లో ఓట్లు పోయాయి. చివరి నిముషంలో తెలుసుకుని ఏం చేయలేకపోయారు. ఇపుడు ఏపీ వంతు వచ్చింది. మరి దాన్ని సరిచేసేందుకు సమయం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పూర్తిగా అధికారులు  బిజీ అయిపోతారు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని ఓట్లు చేర్చినా కూడా అన్యాయం న్యాయం అయిపోదు. 


ఎన్నికలు ఆపాలా :


అందువల్ల ఇపుడున్న పరిస్తితుల్లో కరెక్ట్ ఓటర్ల జాబితా వచ్చేంత వరకూ ఎన్నికలను కొంత కాలం వాయిదా వేయడం మంచిదేమో.  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా పవిత్రమైనది. అదే ఆయుధం కూడా. అటువంటి హక్కులు లాగేసుకునే చర్యలు దారుణాతిదారుణం. మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు తో జాబితాలో అసలు  నిజాయతీ లేదని ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మార్చేందుకు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఈ లోగా ఏపీలో పాలనను గవర్నర్ కి అప్పగించి అన్ని రాజకీయ పక్షాల విశ్వాసం తీసుకున్న మీదటనే ఎన్నికలకు వెళ్తేనే ప్రజాస్వామ్యానికి అసలైన అర్ధం, సార్ధకత లభిస్తాయి. మరి ఆ దిశగా ఆలోచన చేయాలని మేధావులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: