అల్లు అర్జున్ చిన్ననాటి స్నేహితుడు బన్నీ వాస్ పేరు ఎరగని వారు ఫిలిం ఇండస్ట్రీలో ఉండరు. అల్లు అరవింద్ కు పేరుకు ముగ్గురు కొడుకులు అయినా నాల్గవ కొడుకుగా బన్నీ వాస్ అల్లు అరవింద్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి పవన్ తన ‘జనసేన’ కు సంబంధించి ఈనెల 15వ తారీఖున రాజమండ్రిలో నిర్వహింపబోతున్న ‘జనసేన’ ఆవిర్భావ వార్షికోత్సవ సమావేశం నిర్వహించే బాధ్యతకు సంబంధించిన కీలక కమిటీలో బన్నీ వాసుకు పవన్ కీలక బాధ్యతలు అప్పచెప్పడం సంచలనంగా మారింది.

దీనితో గతంలో కొంతకాలం హాట్ టాపిక్ గా కొనసాగిన పవన్ అల్లు అర్జున్ ల మధ్య ఏర్పడ్డ గ్యాప్ కు సంబంధించి పూర్తిగా ఇరు వర్గాలు మర్చిపోవడమే కాకుండా అల్లు అరవింద్ సన్నిహిత వ్యక్తికి ‘జనసేన’ లో కీలక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మారింది. మరో రెండు మూడు రోజులలో ఎన్నికల కమీషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి డేట్స్ క్లారిటీ ఇవ్వబోతున్న నేపధ్యంలో పవన్ ‘జనసేన’ శంఖారావానికి రాజమండ్రి ముఖ్య కేంద్రంగా మారబోతోంది. 

ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ సామాజిక వర్గానికి చెందిన యూత్ ను టార్గెట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహింప బడుతున్న ఈ బహిరంగ సభ బాధ్యతలు పూర్తిగా బన్నీ వాసు తీసుకున్నట్లు సమాచారం. ఇదే బహిరంగ సభ నుండి పవన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు టాక్. 

వాస్తవానికి ‘జనసేన’ ప్రచారానికి పిలిస్తే చాలు అన్నీ వదులుకుని పవన్ వెంట నడవడానికి నాగబాబుతో పాటు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలు పవన్ కు ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నా ఆవిషయాలు పట్టించుకోకుండా పవన్ బన్నీ వాసుకు ‘జనసేన’ లో ప్రాధాన్యత ఇవ్వడం విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో ఓడిపోయిన పాలకొల్లు స్థానం నుండి బన్నీ వాసు ‘జనసేన’ తరఫున పోటీ చేస్తున్నట్లు టాక్. ఈవార్తలే నిజం అయితే తన అన్న చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లులో బన్నీ వాస్ ద్వారా విజయాన్ని అందుకుని అప్పటి పరాభవానికి వ్యూహాత్మకంగా పవన్ సమాధానం ఇవ్వబోతున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: