తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడన్న దానిపైన ఈ మధ్యకాలంలో బాగా చర్చ సాగుతోంది. అయితే లేకేష్ కి సేఫ్ జోన్ని మొత్తానికి టీడీపీ పెద్దలు కనుగొన్నారట. విశాఖ జిల్లాలోని ఓ కంచుకోటను లోకేష్ కోసం రెడీ చేసి పెట్టారట.


భీమిలి నుంచి పోటీ:


మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నుంచి లోకెష్ పోటీ చేస్తారట. ఈ మేరకు అమరావతిలో టీడీపీ సమీక్షా సమావేశంలో వ్యూహాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. విశాఖ నుంచి శ్రీ భరత్ పోటీకి నో చెప్పడానికి కూడా ఇదే కారణం అని అంటున్నారు. తోడల్లుడుకి ఝలక్ ఇస్తూ ఏకంగా లోకేష్ పోటీకి దిగుతున్నారని అంటున్నారు. విశాఖలో  సామాజిక సమీకరణల పరంగా చూసినా విశాఖ తూర్పు నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు.




ఇపుడు భీమిలీ నుంచి నారా లోకెష్ పోటీకి దిగితే మూడవ కమ్మ కులానికి ఎంపీ సీటు ఇవ్వడానికి కుదరదు. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు శ్రీ భరత్ కి టికెట్ ఇవ్వకుండా ఇటు కంచుకోట సీటులో లోకేష్  పోటీకి దిగవచ్చునని టీడీపీ ప్లాన్ వేస్తోంది.


గంటాకు ఎక్కడ :


ఇదిలా ఉండగా భీమిలీ నుంచి పోటీకి దిగుతానని  ఇప్పటివరకూ చెప్పుకొస్తున్న మంత్రి గంటాకు ఈ పరిణామంలో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్ధం కావడంలేదంటున్నారు. అయితే ఆయన్ని విశాఖ పార్లమెంట్ కి పోటీ పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నారా లోకేష్ పోటీతో విశాఖ జిలా రాజకీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: