ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. అయితే చాలా నియోజక వర్గాలకు అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయలేదు. నిజానికి, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరతలేదు. కానీ, గెలిచే అభ్యర్థుల విషయంలో మాత్రం 'కొరత' స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 'ధైర్యం' చేయగలిగారు.. తమ ప్రభుత్వమ్మీద నమ్మకంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిచ్చారు.


డేటా చోరీ : టీడీపీకి కోలుకోలేని దెబ్బ ..!

ఒకటి రెండు చోట్ల మాత్రమే మార్పులు జరిగాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకి అంత సీన్‌ లేదు. అసలంటూ తమ రాజకీయ ప్రత్యర్థి ఎవరో తెలియక చంద్రబాబు సతమతమవుతుండడం గమనార్హమిక్కడ. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఎలా వుందంటే, సామాజిక వర్గ సమీకరణాలు, బ్యాంకు బ్యాలెన్సులు వంటి వాటిని చూసుకుని మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని డిసైడ్‌ చేస్తున్నారాయన.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది.

Image result for chandra babu

పార్టీని నమ్ముకున్నోళ్ళని నట్టేట్లో ముంచేస్తే, ధన బలం వున్నోళ్ళని చంద్రబాబు ఎంపిక చేస్తున్నా.. ఆ ధన బలం వున్నోళ్ళలోనూ చాలామంది, ఆయనతో కష్టమంటూ టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తుండడం గమనార్హం. ఒక్కో నియోజకవర్గం నుంచి పది మందికి పైగానే పోటీదారులున్నారని చంద్రబాబు చెబుతోంటే, 'మాకు ఫలానా సీటు వద్దు మొర్రో..' అంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సిట్టింగ్‌ ఎంపీలైతే, 'ఇక చాలు మేం చేసిన రాజకీయం..' అని చంద్రబాబుకి నమస్కారం కూడా పెట్టేస్తున్నారు. ఇదీ, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత దుస్థితి


మరింత సమాచారం తెలుసుకోండి: