గరుడ పురాణం శివాజీకి ఇప్పడూ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. మొన్నటివరకు జగన్ ను పొగిడి , జగనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి, తరువాత చంద్రబాబు ను పొగడటం మొదలు పెట్టాడు. చంద్ర బాబు ప్రభుత్వంను  పడగొట్టటానికి కేంద్రం ప్రయత్నిస్తుందని, జగన్ ను చంపడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని పెద్ద మేధావి లాగా ఆ మధ్య చేసిన ఓవర్ యాక్షన్ ఎంత చెప్పిన తక్కువే. 


ఏం మాట్లాడుతున్నావు శివాజీ : చంద్రబాబు ను కాపాడటానికి వచ్చావా ..!

చంద్ర బాబు కు , టీడీపీ పార్టీ అనుకూలంగా మాట్లాడుతూ, పచ్చ మీడియా లో తెగ హల్ చల్ చేస్తూ ఏమైనా అడిగితే నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నానని సినిమా డైలాగ్స్ కొడుతుంటాడు. అయితే ఇప్పుడు డేటా విషయం లో టీడీపీ ఇబ్బందుల్లో పడే సరికే . శివాజీ గారు ఒక్క సారిగా వచ్చి ఇదంతా కేంద్రం పనేనని కొత్త కథను అల్లి మీడియా ముందు రచ్చ చేస్తున్నాడు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోపానికి గురవుతున్నాడు. 


ఏం మాట్లాడుతున్నావు శివాజీ : చంద్రబాబు ను కాపాడటానికి వచ్చావా ..!

శివాజీ మాట్లాడుతున్న మాటలను బట్టి దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే మొత్తం టీడీపీదేనని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇట్టే అందరికి అర్ధం అయిపోతుంది. ఒక పక్క కేసీఆర్ , జగన్ ను తిడుతూ చంద్ర బాబు మాత్రం అస్సలు తప్పు చేయలేదని టాప్ క్లాస్ యాక్టర్ గా నటిస్తున్నాడు. డేటా చోరీ విషయం లో టీడీపీ ఆత్మ రక్షణ ధోరణి లో పడి పోయింది. ఐటీ గ్రిడ్ కు టీడీపీ కి ఎటువంటి సంభందం లేక పోతే ఈ ఉలికిపాటి ఎందుకో అర్ధం కావటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: