తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా మండిపడ్డారు.  నిన్న గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..16 మంది ఎంపీలను గెలిపించాలన్న కేటీఆర్‌ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు.  15 మంది ఎంపీలతో ఒక్క విభజన హామీ అయినా సాధించారా అని సూటిగా ప్రశ్నించారు. అమరుల రక్తపు కూడు తింటున్నది కేసీఆర్‌ కుటుంబమేనని దుయ్యబట్టారు.  అమరవీరుల శవాలపై కేటీఆర్‌ పేలాలు ఏరుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Congress Leader Ponnam Prabhakar Fire On TRS Working President KTR In Karimnagar - Sakshi
తాజాగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై  కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మండిపడ్డారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుంటే తట్టుకోలేక ఆ నాయకుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను, తనను పొన్నం ప్రభాకర్‌ వ్యక్తిగతంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పొన్నం ప్రభాకర్‌.. మరో కేఏ పాల్‌ అని అన్నారు. పొన్నం ఐదుసార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిండు... నేను ఐదుసార్లు పోటీ చేస్తే ఐదుసార్లు గెలిచాను. 
Image result for ktr
ఆయనది ఓడే చరిత్ర..మాది గెలిచే చరిత్ర అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో డ్రామా ఆర్టిస్ట్‌ పొన్నం ప్రభాకర్‌..అప్పట్లో నేను కాంగ్రెస్ టిక్కెట్ ఆశించినట్లు దుష్ప్రచారం చేశారని నాపై ఎన్నో ఆరోపణలు చేశారని అన్నారు. కేటీఆర్‌ను విమర్శించే అర్హత పొన్నం ప్రభాకర్‌కు ఉందా? సంస్కారం లేకుండా మాట్లాడితే పొన్నం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: