సాధారణంగా బాగా డబ్బు ఉన్న వారు తమ వారసుల వివాహాలు అంతకన్నా ధనికులైన వారితో చేయాలని చూస్తుంటారు. వారి స్థాయికి తగ్గ సంబంధాలు చూసి ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు.  ఈ మద్య సోషల్ మీడియాలో కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్య కలిగించే విధంగా ఉంటున్నాయి. థాయ్ లాండ్ కు చెందిన అర్డోన్ రొడాంగ్ అనే కోటీశ్వరుడు ఓ సంచలన ప్రకటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. రొడాంగ్ థాయ్ లాండ్ లో ప్రముఖ పండ్ల రైతుగా, వ్యాపారిగా పేరుగాంచాడు.  ఆయన తన కూతురు వివాహం విషయంలో చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తన కుమార్తెను చేసుకున్నవాళ్లకు రూ.2 కోట్లు ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు.  నా కుమార్తె కర్న్ సిటా వయసు 26 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా కూతురికి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూసినా ఆమె ఎవరినీ నచ్చడంలేదు. అందుకే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. మీలో ఎవరైనా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే రూ.2 కోట్ల నజరానాతో పాటు నా వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుంటాను. అంతే కాదు ఏదేశానికి చెందిన వాడైనా పరవాలేదు.. ఆసక్తి ఉంటే తనను సంప్రదించండి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 

ఈ ప్రకటన ఆనోటా ఈనోటా పాకడంతో చివరికి అర్డోన్ రొడాంగ్ కూతురు కర్న్ సిటాకు తెలిసి మొదట జోక్ అనుకున్నా ఇది నిజమని తెలిసి షాక్ కి గురైంది.  సాధారణంగా థాయ్ లాండ్ లో కట్నం ఇచ్చే సంప్రదాయం లేదు. పెళ్లికొడుకే పెళ్లికూతురు తండ్రికి ఎదురు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది.  కానీ అర్డోన్ రొడాంగ్  తన కూతురు విషయంలో తీసుకున్న నిర్ణయం చూసి ఆయన కూతురు  అంగీకరిస్తున్నానని తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: