ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని మీడియా వర్గాలు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నాయని ఇప్పటీకే చాలా మందికి తెలుసు. తన ప్రజాసంకల్పయాత్రతో పాటు సమర శంఖారావాల్లో కూడా ఈ విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతున్నారు జగన్. చంద్రబాబు అను'కుల' మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలు, ఇస్తున్న అనైతిక కథనాల్ని సక్సెస్ ఫుల్ గా ప్రజలకు వివరిస్తున్నారు అధినేత. బహిరంగ సభల్లో కేవలం ఇలా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా.. పార్టీ పరంగా కూడా "ఎల్లో ఛానెల్స్" పై చర్యలు తీసుకుంటున్నారు జగన్.

Image result for jagan

ఈ దిశగా ఇప్పటికే ఏబీఎన్ ఛానెల్ ను బహిష్కరించిన వైఎస్ఆర్సీ పార్టీ, ఇప్పుడీ లిస్ట్ లోకి టీవీ5 అనే మరో ఛానెల్ ను కూడా చేర్చింది. ఇదేదో అనధికారికంగా, చంద్రబాబు స్టయిల్ లో చేస్తున్న నిరసన కాదు. పత్రికాముఖంగా, అధికారికంగా వైసీపీ చేస్తున్న పోరాటం. అవును.. టీవీ5ను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీని భుజాన మోసే స్థితి నుంచి నెత్తినెక్కించుకొని వార్తాప్రసారాలు, టీవీ చర్చలు చేస్తున్న టీవీ5 ఛానెల్ చర్చలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కరు పాల్గొనరాదని పార్టీ నాయకులందర్నీ ఆదేశించడమైనది.

మరో ఛానెల్ ను నిషేధించిన వైసీపీ

మా పార్టీ వాళ్లను చర్చలకు ఆహ్వానించొద్దని టీవీ5కు కూడా స్పష్టం చేస్తున్నాం." ఇలా టీవీ5ను స్వతంత్రంగా నిషేధించినట్టు అధికారికంగా ప్రకటించింది వైసీపీ. ఇదే ప్రకటనలో ఏబీఎన్ ను నిషేధించిన విషయాన్ని కూడా మరోసారి గుర్తుచేసింది. ఈ కాలం మీడియాను బహిష్కరించడమంటే అది మామూలు విషయం కాదు, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయిష్టంగానైనా మీడియాతో చేతులు కలుపుతారు రాజకీయ నాయకులు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలకు బుద్ధివచ్చేలా, అధికారికంగా బహిష్కరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: