సినీ నటుడు శివాజీ పాల్గొన్న ప్రెస్ మీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అతను తనకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు అని ఒక పక్క చెబుతూనే మరోపక్క తెలుగుదేశం పార్టీ మీద వస్తున్న అభియోగాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండడం ఎవరికీ మింగుడుపడటంలేదు. అది పనిగా ఆ పార్టీని  వెనకేసుకొని వస్తూ టిఆర్ఎస్ మరియు బిజేపిలపై విషం చిమ్మడం అందరినీ చిర్రెత్తిస్తోంది.


అలాంటప్పుడు ప్రజల తరఫున మాట్లాడుతున్నానని చెప్పుకోవడం కన్నా ఒక టీడీపీ కార్యకర్త గా మాట్లాడుతున్నాను అనడం మేలని అంటున్నారు. రాజకీయం దురుద్దేశం లేకుండానే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈయన బయటికి రావడం, ఆ పేపర్లు ఈ పేపర్లు తీసుకొని వచ్చి అవతలి వారి పై దుమ్మెత్తి పోయడం చాలా తరచుగా జరుగుతోంది. అంత ఖచ్చితమైన ఆధారాలు ఉంటే చట్టపరంగా వారిపైన కేసు నమోదు చేయవచ్చుగా అన్నది వీరి వాదన.


ఇప్పుడు అతను మోడీ ప్రవేశపెట్టిన “నమో” యాప్ లో కూడా డేటా చోరీ జరిగింది అనడం పక్క రాష్ట్రపు అధికార పక్షం నాలుగేళ్ల క్రితమే దీనికి పాల్పడింది అని నిక్కచ్చి గా నొక్కి వక్కాణిస్తుంటే, ఈ విషయాలన్నీ నీకు టీడీపీ పైన అభియోగాలు వచ్చిన తర్వాతే గుర్తుకు వచ్చాయా అని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా శివాజీ అధికారికంగా టీడీపీలోకి చేరితే మంచిదని లేకపోతే ఈసారి అతని మాటలకు ఎవరు కనీస విలువను కూడా ఇవ్వరని స్పష్టంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: